కుప్పంలో చంద్రబాబు వెనుకంజ.. షాక్ త‌ప్ప‌దా..!

May 23, 2019 at 9:48 am

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు సంచ‌ల‌నం సృష్టించే దిశ‌గా వెళ్తున్నాయి. ఏకంగా హేమాహేమీల‌కు షాక్ ఇవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే అతిపెద్ద ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంటాడా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ట్రెండింగ్‌ను చూస్తే.. ఇదే విష‌యం అర్థ‌మ‌వుతోంది.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే.. కౌంటింగ్‌లో ఆయ‌న‌ వెనుకంజలో ఉన్నారు. మొదటి, రెండో రౌండ్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి ముందజలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండింగ్ కొన‌సాగితే.. మాత్రం చంద్ర‌బాబు ఓట‌మి ఖాయంగానే క‌నిపిస్తోంది.

వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడుతో చంద్ర‌బాబు కుప్ప‌కూలడం త‌ప్ప‌ద‌ని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కుప్పంలో చంద్ర‌బాబును ఓడించి వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌మౌళి చ‌రిత్ర సృష్టిస్తార‌ని ఆయ‌న అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ పార్టీనే కాదు.. ఏకంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే వెనుకంజ‌ప‌డ‌డంతో తెలుగుత‌మ్ముళ్లు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు.

కుప్పంలో చంద్రబాబు వెనుకంజ.. షాక్ త‌ప్ప‌దా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts