చంద్ర‌బాబు కొంప‌ముంచిన నెంబ‌ర్‌… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

May 25, 2019 at 11:52 am

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తు‘ఫాన్‌’తో అడ్రస్‌ లేకుండాపోయిన తెలుగుదేశం పార్టీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ సెటైర్లు పేలుతున్నాయి. చంద్ర‌బాబు ఇంటిలో కూర్చొని మ‌న‌వ‌డు దేవాన్ష్‌తో ఆడుకోవాల‌ని.. లోకేష్ విదేశాల‌కు వెళ్లి ఎంజాయ్ చేయాల‌ని… బాల‌య్య ఎంచ‌క్కా సినిమాలు తీసుకోవాల‌ని ఇలా ర‌క‌ర‌కాల సెటైర్లు పేలుతున్నాయి. మ‌రికొంద‌రు అయితే చంద్ర‌బాబు నుంచి నంద‌మూరి ఫ్యామిలీ ప‌గ్గాలు లాక్కొని చంద్ర‌బాబును బ‌య‌ట‌కు గెంటి వేయాల‌ని కూడా జోకులు పేలుస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఓ మెసేజ్ టీడీపీ సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. 23 నెంబ‌ర్ టీడీపీ కొంప‌ముంచింద‌న్నదే ఆ మెసేజ్ సారాంసం. ఆ నెంబ‌ర్ 23. ఎందుకంటే 23 నెంబ‌ర్ చంద్ర‌బాబుకు ఎప్పుడూ అచ్చిరాలేదు. ఈ నెంబ‌ర్ చంద్ర‌బాబుకు ఎప్పుడూ ప‌రాజ‌య‌మే మిగిల్చింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మందిని చంద్ర‌బాబు త‌న పార్టీలో చేర్చుకుని.. వీరిలో కొంత‌మందికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు.

ఇక తాజాగా గురువారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో కూడా టీడీపీ ఎంత‌మంది ఎమ్మెల్యేల‌ను వైసీపీ నుంచి లాక్కొందో అంతేమంది మిగిలారు. ఇక ఫ‌లితాలు వెల్ల‌డైన తేదీ కూడా 23నే కావ‌డం విశేషం. ఇలా 23 ప్ర‌తిసారి చంద్ర‌బాబుతో ముడిప‌డుతూ వ‌స్తోంది. ఇదే 23 ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేసింది.

చంద్ర‌బాబు కొంప‌ముంచిన నెంబ‌ర్‌… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts