గుంటూరోళ్లకు కుల,డబ్బు పిచ్చి.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

May 13, 2019 at 12:35 pm

గుంటూరు అంటే మిర్చి ఘాటు కు ఫేమ‌స్‌. గుంటూరు మిర‌ప‌కాయ్ ఎంత ఘాటో అక్క‌డి రాజ‌కీయాలు అంత‌క‌న్నా ఘాటూ. రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లకు పెట్టింది పేరు. అలాంటి గుంటూరు జిల్లోని రాజ‌కీయాల‌కు కుల గ‌బ్బుతో, డ‌బ్బు జ‌బ్బుతో కొట్టుకుంటున్నారు. అయితే గుంటూరు జిల్లా రాజ‌కీయాల‌కు ఇప్పుడు కుల పిచ్చిగాళ్ళు, డ‌బ్బు పిచ్చిగాళ్ళ పీడ ప‌టుకుంద‌ని ఆరోపిస్తున్నారు సిని న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త‌. గుంటూరు జిల్లా కుల పిచ్చి, డ‌బ్బు పిచ్చి ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌తో నిండి ఉంద‌ని, నిజాయితీ ప‌రులైన రాజ‌కీయ నేత‌లు ఒక్క‌రు క‌నిపించ‌టం లేద‌ని మాధవీల‌త‌.

ఇటీవ‌ల ఆమే మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజ‌కీయాల్లో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని అడిగితే ఆమే క‌ట్టె విరుగ‌కుండా, పాము చావ కుండా స‌మాధానం చెప్పారు. నా నోటితో నేను చెప్ప‌డం ఏందుకండి… ఎవ‌రు గెలుస్తారో ఎవ‌రు ఓడుతారో… అది ప్ర‌జ‌లకు స్ప‌ష్టంగా తెలుసండి… మేమే గెలుస్తామ‌ని చెపుతున్న నాయ‌కులంతా మేకపోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆమే ముక్తాయించారు.

తెలుగు ప్ర‌జ‌లంటే గ‌తంలో ఎంతో గౌర‌వం ఉండేదట‌. గ‌తంలో ఏంతో నీతి నిజాయితీల‌కు తెలుగు ప్ర‌జ‌లు ఎంతో విలువ ఇచ్చేవార‌ట‌… కానీ ఇప్పుడు ఆ గౌర‌వం గంగ‌లో క‌లిసింద‌ట‌. నీతి నిజాయితీలు నీటీపాల‌య్యాయ‌ట‌. తెలుగు ప్ర‌జ‌లంటే కేవ‌లం డ‌బ్బులు తీసుకొని ఓట్లేసే ఓ ఓటు యంత్రాల‌ని మాధ‌వీలత అభిప్రాయమ‌ట‌. నిజాయితీ క‌లిగిన నాయ‌కుల‌కు గుంటూరు జిల్లాలో స్థానం లేద‌ని, ప్ర‌జ‌లు అవినీతిని ప్రోత్స‌హించినంత కాలం నీతి ప‌రులు రాజ‌కీయాల్లో పుట్ట‌లేరని ఆమే జోస్యం చెపుతున్నారు. ఏదేమైనా మాధ‌వీల‌త అభిప్రాయం ప్ర‌కారం గుంటూరు రాజ‌కీయాలు గ‌బ్బు రాజ‌కీయాల‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

గుంటూరోళ్లకు కుల,డబ్బు పిచ్చి.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts