జ‌మ్మ‌లమ‌డుగు రహస్యం …!

May 15, 2019 at 12:22 pm

జ‌మ్మ‌ల‌మ‌డుగు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. జ‌గ‌న్‌కు కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఆదినారాయ‌ణ‌రెడ్డి గెలిచారు. అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆక‌ర్ష్ యాక్ష‌న్‌తో ఆయ‌న వైసీపీకి బై చెప్పి.. టీడీపీలోకి చేరిపోయారు. మంత్రి ప‌దివిని కూడా పొందారు. అయితే, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన రామ‌సుబ్బారెడ్డికి, వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఆదికి మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ వైరంతో పాటు వ్య‌క్తిగ‌త వైరం కూడా కొన‌సాగింది. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే, ఇప్పుడు ఆది టీడీపీలోకి చేరిపోవ‌డంతో రామ‌సుబ్బారెడ్డికి ఆయ‌న‌కు మ‌ధ్య చంద్ర‌బాబు స‌యోధ్య చేకూర్చారు. అదేస‌మ‌యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు టికెట్‌ను రామ‌సుబ్బారెడ్డికే ఇచ్చి.. క‌డ‌ప ఎంపీ టికెట్‌ను ఆదికి కేటాయించారు. ఈ క్ర‌మంలోనే ఇరు ప‌క్షాలూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని విజ‌యం సాధించాల‌ని సూచించారు. దీంతో ఇరు ప‌క్షాలు కూడా ప్ర‌చారంలో జోరుగా పాల్గొన్నాయి. మీడియా ఆది, రామ‌సుబ్బారెడ్డిలు క‌లిసి సంయుక్తంగా ఫోజులు కూడా ఇచ్చారు. కలిసి ప్రెస్‌మీట్‌లు నిర్వ‌హించారు.దీంతో అంతా బాగానే ఉంద‌ని, ద‌శాబ్దాల వైరం తొల‌గిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు.

మ‌రి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇలానే ఉందా? ఎన్నిక‌ల్లోనూ ఇలానే ఇద్ద‌రూ క‌లిసిపోయారా? అనే సందేహాలు అనేకం తెర‌మీదికి వ‌చ్చాయి. ఇద్ద‌రూ పైకి క‌నిపించిన‌ట్టు స‌ఖ్య‌తగా మాత్రం ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నిపించ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లోపాయికారీగా ఒక‌రి ఓట‌మికి మ‌రొక‌రు ప్ర‌య‌త్నించార‌ని, కేడ‌ర్ కూడా అదేవిధంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అంటున్నారు. ఇక్క‌డ ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ఎం. సుధీర్ రెడ్డి బ‌రిలో నిలిచారు. జ‌గ‌న్ మ్యానియా భారీగా ప‌నిచేసింది. పైగా ఆది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీలో గెలిచి మంత్రి ప‌ద‌విపై మోజుతో టీడీపీలోకి వెళ్ల‌డాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.

పైగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా తీవ్ర‌స్థాయిలో పోరు చేసుకున్న ఇద్ద‌రు కూడా ఇప్పుడు క‌లిసిపోయామంటూ … చేతులు క‌లుపుకోడాన్ని కూడా ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు దీంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో సుధీర్‌రెడ్డిదే విజ‌య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. మెజారిటీత‌గ్గినా..కూడా సుధీర్‌దే విజ‌య‌మ‌ని బెట్టింగులు క‌డుతున్న‌వారి సంఖ్య పెరిగింది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఇంకా 9 రోజుల వ్య‌వ‌ధి ఉండ‌డంతో బెట్టింగుల జోరు మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌మ్మ‌లమ‌డుగు రహస్యం …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts