అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్ ప్రకటన

May 21, 2019 at 11:05 am

ఓ వైపు స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి చిత్రంలో న‌టిస్తూనే మ‌రోవైపు త్రివిక్ర‌మ్‌తో నెక్ట్స్ సినిమాకు జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు తర్వాత కుదిరితే మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు. పుట్టినరోజు సందర్భంగా రాత్రి తనను కలిసేందుకు ఇంటికొచ్చిన అభిమానులతో పిచ్చాపాటీ మాట్లాడిన తారక్, మాటల మధ్యలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత సినిమా మంచి విజ‌యాన్నే న‌మోదు చేసింది. భారీ విజ‌యం కాక‌పోయిన అలా అని ప్లాప్ కూడా అన‌కుండా మ‌ధ్య‌స్థంగా తార‌క్‌ను నిల‌బెట్టింది.

అయితే త్రివిక్ర‌మ్ టేకింట్ తార‌క్‌ను ముచ్చ‌ట‌గొలిపిందంట‌. అందుకే ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే మ‌రో సినిమా కూడా చేద్దాం అని ఇద్ద‌రూ అనుకున్నార‌ట‌. ఇటీవ‌ల స్టోరీ లైన్‌ను ఎన్టీఆర్‌కు వినిపించ‌గా పూర్తి క‌థ‌ను సిద్ధం చేయండి అంటూ త్రివిక్ర‌మ్‌కు చెప్పాడ‌ట‌. ఇప్పుడు ఇద్ద‌రు వేర్వేరు సినిమాల షూటింగ్‌లతో బిజిగా ఉండ‌టంతో త్వ‌ర‌లోనే ఆ ప‌ని పూర్త‌య్యాక క‌థాచ‌ర్చ‌లు మొద‌లవుతాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా కూడా మాస్ అండ్ క్లాస్ ఆడియోన్స్‌ను మెప్పించేలా ఉంటుంద‌ని స‌మాచారం.

ఎన్టీఆర్ మ్యాన‌రిజంకు, హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా త్రివిక్ర‌మ్ క‌థ ఉండ‌బోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ కంప్లీట్ అయి, అది థియేటర్లలోకి వచ్చేంత వరకు మరో ప్రాజెక్టు టచ్ చేయడు. కానీ ఆర్-ఆర్-ఆర్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. అందులో కొంత నిజం కూడా ఉంది. కానీ తారక్ మాత్రం మరోసారి త్రివిక్రమ్ వైపే మొగ్గుచూపాడు. ఇదిలాఉండ‌గా చ‌ర‌ణ్ కూడా త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడ‌ట‌. చ‌ర‌ణ్‌కు కూడా ఓ క‌థ సిద్ధం చేశాన‌ని ఆ మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్ ప్ర‌క‌టించేశాడు. ఈ గ్యాప్‌లో ఏమైనా నిర్ణ‌యాలు మారుతాయో చూడాలి.

అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్ ప్రకటన
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts