కేసీఆర్ మార్క్ రివేంజ్‌…ఐదుగురు మంత్రులు అవుట్‌

May 28, 2019 at 3:15 pm

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎవ‌రిమీద అయినా ప్రేమ పుడితే ఆ ప్రేమ మామూలుగా ఉండ‌దు. వారిని నెత్తిన పెట్టేసుకుంటారు. అలాగే కేసీఆర్ ఎవ‌రిమీద అయినా ప‌గ‌ప‌డితే ఆ ప‌గ మామూలుగా ఉండ‌దు. ప‌దునైన మాట‌ల తూటాల‌తో వారిపై విరుచుకుప‌డ‌డంతో పాటు వాళ్ల అంతు చూసేదాక విడిచిపెట్ట‌రు. అంతెందుకు మొన్న‌టికి మొన్న తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న‌కు అసెంబ్లీలో అడ్డొస్తార‌ని మ‌హామ‌హుల‌నే వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో గెల‌వ‌కుండా చిత్తుగా ఓడించేశారు.

ఆ త‌ర్వాత కాస్త అహం నెత్తికెక్కించుకున్నార‌న్న టాక్ ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లు ఉద్య‌మంతో రాష్ట్రాన్ని సాధించుకున్నారు… వాళ్ల‌కు కేసీఆర్ అహాన్ని అణ‌చ‌డం పెద్ద లెక్క‌కాదు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ ఓవ‌ర్ కాన్పిడెన్స్‌తో సారు – కారు – పదహారు – ఢిల్లీలో టీఆర్ఎస్ సర్కారు… అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఫ‌లితాలు వ‌చ్చాక చూస్తే కేసీఆర్‌కు ఎక్క‌డో షాక్ కొట్టేసింది. స‌మాధి చేశాన‌నుకున్న కాంగ్రెస్ మూడు ఎంపీలు గెలిస్తే… వంద సీట్ల‌లో డిపాజిట్లు రాని బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది.

తెలంగాణ వైపు బీజేపీ దూసుకువ‌స్తోంద‌న్న మాట వింటేనే కేసీఆర్‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీ సీట్లు గెలిపించాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించిన మంత్రులు ఫెయిల్ అయిన చోట్ల వాళ్ల‌ను త‌ప్పించేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఎంత‌టి వారు అయినా తేడా వ‌స్తే వాళ్ల విష‌యంలో కేసీఆర్ కొర‌డా ఝులిపించేస్తారు. ఇక సొంత పార్టీ వాళ్లు ఆయ‌న‌కు ఓ లెక్కా అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ కీల‌క నేత‌లు ఓడిన చోట్ల వాళ్ల‌ను త‌ప్పించి… కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తేనే బెట‌ర్ అని కేసీఆర్ త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సొంత కుమార్తెనే గెలిపించుకోలేని సీఎం అన్న వార్త‌లు జాతీయ మీడియాలో బాగా స్ప్రెడ్ అవ్వ‌డంతో అటు దేశ‌వ్యాప్తంగా కూడా కేసీఆర్ ప్ర‌తిష్ట కాస్త మ‌స‌కబారిన‌ట్ల‌య్యింది. ఆదిలాబాద్ బాధ్యతలు చూసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి – బాల్కొండలో రవాణాశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి – సికింద్రాబాద్ ప్లాప్‌కు తలసాని శ్రీనివాసయాదవ్ – మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఇక్క‌డ గెలిచినా మంచి మెజార్టీ రాలేదు) – నల్గొండకు సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డిని త్వరలోనే తప్పిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సంకేతాలు వచ్చేయడంతో ఈ ఐదుగురు మంత్రులకూ టెన్షన్ మొదలైందట.

మ‌రీ ముఖ్యంగా నిజామాబాద్‌లో త‌న ఓట‌మిపై క‌విత ప్ర‌శాంత్‌రెడ్డిపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నిక‌ల త‌ర్వాత ఫుల్ ఖుషీ ఫ‌లితాల‌తో కేబినెట్‌ను విస్త‌రించ‌వ‌చ్చ‌ని అనుకున్న కేసీఆర్‌కు ఫ‌లితాల త‌ర్వాత పెద్ద షాక్ త‌గ‌ల‌డంతో ఇప్పుడు వీరిని పీకేసి … వీరి ప్లేసుల్లో కొత్త వారితో కేబినెట్ కూర్పు చేస్తారంటున్నారు. కేసీఆర్ అసాధ్యుడు గ‌నుక ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.. అందుకే ఎవ‌రైనా సిద్ధంగా ఉండాల్సిందే.

కేసీఆర్ మార్క్ రివేంజ్‌…ఐదుగురు మంత్రులు అవుట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts