ఇదే “మహర్షి” ఫైనల్ కలెక్షన్స్

May 22, 2019 at 12:29 pm

ముందు ఎగిసి..త‌ర్వాత ప‌డిపోయినా చివ‌రికి మ‌ళ్లీ కోలుకుని మ‌హ‌ర్షి సినిమా మంచి వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 13 రోజుల్లో 72 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మించిన విషయం తెలిసిందే . మే 9 న విడుదలైన మహర్షి చిత్రానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర‌క‌మైన టాక్ వినిపించింది. అయితే వ‌సూళ్ల‌లో మాత్రం మంచి ర‌న్నింగే ఉంద‌ని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోద‌గిన వ‌సూళ్ల‌నే సాధిస్తోంది. రైతు సమస్యలపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశంసలు లభిస్తున్నాయి .

బాక్సీఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు కురిపిస్తున్న ఈచిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. వంశీపైడిప‌ల్లి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఎక్క‌డా మిస్స‌వ‌కుండానే సందేశాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని సినీ పండితులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కాస్త నిడివి ఎక్కువైన మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టి క‌థాప‌ర‌మైన అంశాల‌తో ముడిప‌డి ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఎక్క‌డా బోర్గా ఫీల్‌కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడ‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్ల‌లో దూసుకెళ్తున్న మ‌హ‌ర్షి సినిమాకు ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఎదురుదెబ్బ త‌గులుతోంది. మ‌హేష్ గ‌త చిత్రాల క‌న్నా త‌క్కువ‌గా వ‌సూళ్లు సాధించ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి భారీ ఓవ‌ర్సీస్ మార్కెట్ క‌లిగిన ఉన్న హీరోల్లో మ‌హేషే అగ్రుడు. ఎందుక‌నో ఈ సినిమా ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు త‌గ్గ‌డం తో మ‌హేష్ కూడా చిన్న‌బోయాడ‌ట‌. ప్రాంతాల వారిగా మహర్షి వసూళ్లను ఒక్క‌సారి ప‌రిశీలించిన‌ట్ల‌యితే ఈవిధంగా ఉన్నాయి.
నైజాం – 25 . 40 కోట్లు, సీడెడ్ – 9. 06 కోట్లు, కృష్ణా – 5. 42 కోట్లు, గుంటూరు – 7. 86 కోట్లు, ఈస్ట్ – 7. 92 కోట్లు, వెస్ట్ – 5. 51 కోట్లు, నెల్లూరు – 2. 70 కోట్లు, ఉత్తరాంధ్ర – 8. 94 కోట్లు, మొత్తం – 72 .79 కోట్లు.ఇంకో వారం వ‌ర‌కు సినిమా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉడ‌టంతో 100కోట్ల మార్క్ దాటుతుంద‌నే అంచ‌నాతో చిత్ర‌యూనిట్ ఉంది. చూడాలి ఏం జ‌రుగుతుందో…?

ఇదే “మహర్షి” ఫైనల్ కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts