‘ మ‌హ‌ర్షి ‘ పై ర‌గిలిపోతోన్న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు

May 19, 2019 at 11:53 am

మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏంటో ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. అస‌లు క‌లెక్ష‌న్లు ఎలా ? ఉన్న యూనిట్ మాత్రం పోస్ట‌ర్ల మీద పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తూ మ‌హ‌ర్షిని పోస్ట‌ర్ల మీదే సూప‌ర్ హిట్ చేసేసింది. నాలుగు రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు.. 65 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింద‌ని చెప్పారు. ఇక సినిమా యూనిట్ అయితే మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే టాప్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని చెపుతుండ‌డం చాలా మందికే కాదు.. చివ‌ర‌కు సూప‌ర్‌స్టార్ వీరాభిమానుల‌కు కూడా న‌చ్చ‌డం లేదు.

ఈ సినిమాను ఎపిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా యూనిట్ తెగ డ‌బ్బాలు కొట్టుకుంటున్నా వాస్త‌వంగా సెకండ్ వీక్‌లోకి ఎంట్రీ ఇచ్చేస‌రికి సినిమా వీక్ అయ్యింది. దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్న నైజాంలో మిన‌హా మిగిలిన ఏరియాల్లో ఎక్క‌డా ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు అయితే లేవ‌న్న‌ది మాత్రం నిజం. అదే టైంలో సినిమాకు వ‌చ్చిన టాక్‌తో పోలిస్తే వ‌సూళ్లు ఎక్కేవే వ‌చ్చి ఉండొచ్చు… అంత మాత్రాన మ‌హ‌ర్షి హిట్ అయిన‌ట్టు కాదు.. ఈ సినిమా బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చిన‌ట్టు కాదు.

సీడెడ్‌, ఓవ‌ర్సీస్లో అయితే మ‌హ‌ర్షి ప్లాప్ దిశ‌గా వెళుతోంది. నైజాంలో కూడా రాజు రేట్లు పెంచుకునేలా ప్లాన్ చేసుకోవ‌డంతో అక్క‌డ ఇప్ప‌టికే లాభాల్లోకి వ‌చ్చేసింది. ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు ఈ కీల‌క ఏరియాలు అన్ని ఇప్ప‌ట‌కీ బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. రెండో వారంలో క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అవ్వ‌డంతో బ్రేక్ ఈవెన్‌కు వ‌స్తుందా ? రాదా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్ప‌ట‌కీ ఎంత వ‌సూలు చేసిందో ? ఇంకా అంత వ‌సూలు చేయాలి. అయితే అప్పుడే లాభాలంటూ చెప్పుకోవ‌డంతో మ‌హ‌ర్షి సినిమా యూనిట్‌పై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, బ‌య్య‌ర్లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సినిమా ప్లాప్ అయితే బ‌య్య‌ర్లు ముందునుంచే నిర్మాత‌ల వెంట‌ప‌డి అమౌంట్ వెన‌క్కు తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు. కానీ సినిమా హిట్ అంటూ నిర్మాత‌ల హ‌డావిడి.. ఇక్క‌డ వ‌సూళ్లు రాలేదు. హీరోకు రూ.25 కోట్లు ముట్టాయ‌ట‌. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అంద‌రూ లాభ‌ప‌డ్డారు. వాళ్లు పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. మ‌హేష్ కాల‌ర్లు ఎగ‌రేస్తున్నాడు.. చివ‌ర‌కు బ‌య్య‌ర్లు మాత్రం నిండా ముగినిపోయే ప‌రిస్థితుల్లో ఉన్నారు. అందుకే వీరు త‌మ గోడు ప‌ట్టించుకోకుండా సినిమా హిట్ అంటుండ‌డంతో ర‌గిలిపోతున్నార‌ట‌. మొత్తానికి ఫైన‌ల్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాక అయినా మ‌హ‌ర్షి బ‌య్య‌ర్ల గొడ‌వ ఉండేలా ఉంది.

‘ మ‌హ‌ర్షి ‘ పై ర‌గిలిపోతోన్న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts