క్లూస్ లేని ‘మ‌హ‌ర్షి’ ట్రైల‌ర్‌…(వీడియో)

May 1, 2019 at 9:14 pm

మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఈ రోజు ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో రిలీజ్ అయిన ఈ ట్రైల‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి స్టైలీష్ మార్క్ టేకింగ్‌తో ట్రైల‌ర్ క‌ట్ చేసిన‌ట్లు ఉంది. ద‌ర్శ‌కుడు చాలా తెలివిగా క‌థ చెప్ప‌కుండా, క్లూస్ లేకుండా ట్రైల‌ర్ క‌ట్ చేసిన‌ట్లు ఉంది. జ‌య‌సుధ – ప్ర‌కాష్‌రాజ్ రిషి (మ‌హేష్‌) త‌ల్లిదండ్రులు. కాలేజ్‌లో ర‌వి (అల్ల‌రిన‌రేష్‌)తో స్నేహం, పూజాహెగ్డేతో ప్రేమాయ‌ణం లాంటి వ్య‌వ‌హార‌లు ఉంటాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఇక స్ట‌డీస్ కంప్లీట్ చేసుకుని విదేశాల‌కు వెళ్లే రిషీ తిరిగి ఇండియాకు వ‌చ్చాక సినిమా క‌థ‌లో అస‌లు ట్విస్టులు, మ‌లుపులు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఓ బిగ్గెస్ట్ బిజినెస్‌మేన్ (జ‌గ‌ప‌తిబాబు)ను స‌వాల్ చేస్తాడు. అప్పుడు క‌థ పూర్తిగా మ‌లుపు తిరుగుతుంద‌ని తెలుస్తోంది. ఉన్న‌త చ‌దువులు చ‌దివి, విదేశాల‌కు వెళ్లిన రిషీ గ్రామాల‌కు వెళ్లి వ్య‌వ‌సాయం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ర‌వికి, రిషికి ఉన్న సంబంధం ఏంటన్న‌ది కూడా సినిమాలో కీల‌కం కానుంది.

ఓవ‌రాల్‌గా చూస్తే టీజ‌ర్‌, ఆడియోతో నీర‌స‌ప‌డిన ఫ్యాన్స్‌కు, మహ‌ర్షి వీరాభిమానుల‌కు కాస్తా ట్రైల‌ర్‌తో మాంచి ఊపు వ‌చ్చింది. ట్రైల‌ర్ చాలా నీట్‌గా క‌ట్ చేశాడ‌న్న ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హేష్ లుక్స్ బాగున్నాయి. ఇక టెక్నిక‌ల్‌గా కూడా సినిమా హైస్టాండ‌ర్డ్స్‌లో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఫైట్స్ అదిరిపోయేలా ఉండ‌డంతో మాస్ ప్రియుల‌కు విందు భోజ‌న‌మే. ఇక మ‌హ‌ర్షి ఎలా ర‌చ్చ చేయ‌బోతున్నాడో ? ఈ నెల 9న తేలిపోనుంది.

క్లూస్ లేని ‘మ‌హ‌ర్షి’ ట్రైల‌ర్‌…(వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts