మ‌హేశ్…పూరీని వెలివేశాడా..!?

May 3, 2019 at 4:19 pm

సినీ ఇండ‌స్ర్టీలో రిలేష‌న్స్ మెయింటెన్ చేయ‌డం ఒక క‌ళ‌గా చెప్పొచ్చు. అందునా హీరో, ద‌ర్శ‌కుల మ‌ధ్య సంబంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌వ‌నే ఒక పుకారు కూడా ఉంది. కానీ, మ‌హేశ్ బాబు త‌న ద‌ర్శ‌కుల‌తో మంచి సంబంధాలు సాగిస్తార‌ని ఎప్పుడు చెప్పుకుంటుంటారు. కానీ, ఈ మ‌ధ్య హైద‌రాబాద్ పీపుల్స్ ప్లాజాలో జ‌రిగిన మ‌హ‌ర్షి వేదిక‌గా చోటు చేసుకున్న మ‌హ‌ర్షి ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతున్నాయి. త‌న 25వ చిత్రంగా విడుద‌ల కాబోతున్న మ‌హ‌ర్షి వేడుక‌ల్లో మ‌హేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో ప‌లువురు విశ్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన సినిమాల గురించి మ‌హేశ్ వేదిక సాక్షిగా అతిర‌థుల‌తో, అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా **రాజ‌కుమారుడు**, **ఒక్క‌డు**, **అత‌డు**, **శ్రీ‌మంతుడు**, **భ‌ర‌త్ అను నేను** సినిమాల గురించి మ‌హేశ్ మాట్లాడారు. కానీ త‌న‌కు ఎంతో స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టిన **పోకిరి** సినిమా గురించి ర‌వ్వంతైనా ప్ర‌స్థావ‌న తీసుకురాలేదు. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

ద‌ర్శ‌కుల‌తో క‌మిట్ అయితే మ‌హేశ్‌బాబు బ్ల‌యిండ్‌గా ఫాలో అవుతార‌నే టాక్ ఉంది. అందునా పూరీతో మ‌హేశ్‌కు మంచి రిలేష‌నే ఉండేది. అయితే పోకిరి, బిజినెస్ మెన్ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య కాస్త చెడిన‌ట్టు ఉంది. ఒక విష‌య‌మై ఇద్ద‌రు కాస్త పేచీకి పోయారు. అప్ప‌టి నుంచి పూరీని అస‌లు మ‌హేశ్ ఎక్క‌డ ప్ర‌స్తావ‌న కూడా తీసుకోవ‌డం లేదు. అప్ప‌టి నుంచి పూరీని ఎంతో దూరంలో పెట్టాడు. దాని ప్ర‌భావ‌మే మ‌హ‌ర్షి వేడుక‌ల్లో పోకిరి గురించి ఊసైన ఎత్త‌క‌పోవ‌డం. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు మ‌హేశ్‌పై అస‌హ‌నంగా ఉన్న‌ట్టు కూడా తెలుస్తోంది. కాగా, సీనియ‌ర్ ద‌ర్శ‌కుల కంటే యువ‌త‌రానికి అవ‌కాశం ఇచ్చి వారి టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి మ‌హేశ్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

మ‌హేశ్…పూరీని వెలివేశాడా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts