నాగచైతన్య,సమంత మధ్య మొదలైన వివాదం !

May 18, 2019 at 4:54 pm

అక్కినేని సమంత , నాగ‌చైత‌న్య ఇద్ద‌రు భార్య‌భ‌ర్త‌లు. అంద‌రు భార్య‌భ‌ర్త‌ల్లాగే వీళ్ళ సంసారం సాగుతుంది. కాని వీరిద్ద‌రి ఆఫీసు స్టాఫ్ చేయ‌బట్టి ఇద్ద‌రు ఎక్క‌డ డిష్యూం డిష్యూం అనుకుంటారోన‌నే భ‌యం ప‌ట్టుకుంది వీరి అభిమానుల‌కు. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా వీరి సిబ్బంది చేస్తున్న‌వ్య‌వ‌హారం వీరికి త‌ల‌నొప్పి తెప్పిస్తుంది. నాగ‌చైత‌న్య‌కు, స‌మంత‌కు వేర్వేరుగా సిబ్బంది ఉన్నారు. ఎవ‌రికి సంబంధించిన వ్య‌వ‌హారాలు వారి సిబ్బందే చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఇద్ద‌రి సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌తో ఇరువురికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తుతుంది.

ఇటీవ‌ల భార్యాభ‌ర్త‌లు క‌లిసి మ‌జిలి సినిమాలో న‌టించారు. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్టైంది. స‌మంత, నాగ‌చైత‌న్య లు ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డి మ‌రి న‌టించారు. దీంతో సినిమా భారీ విజ‌యాన్ని అందుకొంది. సినిమా విజ‌యం సాధించిన ఆనందంలో భార్యాభ‌ర్త‌లు ఫారీన్ టూర్‌కు చెక్కెశారు. అక్క‌డ ఇద్ద‌రు ఏంచ‌క్కా జ‌ల‌కాలాట‌ల‌లో ఏమీ హాయిలే ఇలా అని జాలీగా పాట‌లు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్‌గా ఉంది.

నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టించిన సినిమా మ‌జిలి సినిమాలో మా స‌మంత మేడ‌మ్ బాగా న‌టించారని ఆమే సిబ్బంది అంటుంటే, కాదు కాదు మా నాగ‌చైత‌న్య సారే బాగా న‌టించాడ‌నే వాదోప‌వాదాలు సాగుతున్నాయ‌ట‌. ఎవ‌రి సిబ్బంది వారివైపు వ‌క‌ల్తా పుచ్చుకొని మాట్లాడుతూనే ఒక్కోసారి ఘ‌ర్ష‌ణ ప‌డే స్థాయికి వెళుతున్నార‌ట‌. ఇది ఇద్ద‌రికి త‌ల‌నొప్పిగా మారిపోయింద‌ట‌. సిబ్బంది మాత్రం ఏమి చేస్తారు. ఎవ‌రి ఆఫీస్‌లో ప‌ని చేస్తే వారు ఇచ్చే బ‌హుమానాల‌కు, అభిమానానికి బానిస‌లుగా మారిన సిబ్బంది వారి గురించి గొప్ప‌గా చెప్ప‌డం అల‌వాటు చేసుకున్నారు. దీంతో వారి ఇగోల ప్రాబ్ల‌మ్ భార్య‌భ‌ర్త‌ల‌కు సంక‌టంగా మారింది.

నాగచైతన్య,సమంత మధ్య మొదలైన వివాదం !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts