నెల్లూరులో ఎవ‌రి బ‌లం ఎంత‌…. ఎవ‌రి లెక్క‌లేంటి?

May 4, 2019 at 12:24 pm

ఎన్నిక‌లు ముగిసి మూడు వారాలు పూర్త‌యినా.. ఉత్కంఠ మాత్రం ఎక్క‌డా ఒక్క ఇంచ్ కూడా త‌గ్గ‌లేదు. పైగా ఫ‌లితాల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ ఉత్కంఠ మ‌రింత పెరుగుతోంది. పార్టీలు వేటిక‌వే.. త‌మ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. నిన్న‌టికి నిన్న సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎవ‌రు ఎన్ని జిమ్మి క్కులు చేసినా కూడా.. గెలుపు త‌మ‌దేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జిల్లాల వారీగా గెలుపు గుర్రాలెన్ని, ఎక్కువ సీట్లు ఎక్క‌డ వ‌స్తాయ‌నే కోణంలో రివ్యూల‌కు కూడా రెడీ అయ్యారు. మ‌రోప‌క్క‌, వైసీపీ ఇప్ప‌టికే త‌మ గెలుపు ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.

ఇదే స‌మ‌యంలో ఈ రెండు పార్టీలు జిల్లాల వారీగా ఎవ‌రు ఎక్క‌డ ఎన్ని సీట్లు సాధిస్తార‌నే విష‌యంపై కూడా క్లారిటీ గా ఉండ‌డం గ‌మ‌నార్హం. జిల్లాల విష‌యానికి వ‌చ్చినా..కూడా దాదాపు స‌గానికిపైగానే క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ఇరు పార్టీల్లోనూ భ‌రోసా వ్య‌క్త‌మ‌వుతోంది. నెల్లూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ, టీడీపీలు భారీగానే త‌ల‌ప‌డ్డా యి. అయితే, ఎక్కువ స్థానాల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 7 చోట్ల విజ‌యం సాధించ‌గా.. టీడీపీ కేవ‌లం 3 స్థానాల్లో మాత్ర‌మే పాగా వేయ‌గ‌లిగింది. అయితే, తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో మాత్రం మొత్తం ప‌ది స్థానాలూ కైవ‌సం చేసుకునే స్థాయిలో ఈ రెండు పార్టీలు పోరాడాయి.

ఈ క్ర‌మంలోనే వైసీపీ, టీడీపీల మ‌ధ్య ఎత్తులు పై ఎత్తులు కూడా జ‌రిగాయి. ఇక, ఆయా పార్టీల నేత‌ల అంచ‌నాల‌ను బ‌ట్టి.. రెండు పార్టీలు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాయ‌నే ధీమాలో ఉండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీపై పైచేయి సాధించాల‌ని టీడీపీ, టీడీపీకి ఒక్క‌స్థానం కూడా మిగ‌ల్చ‌కుండా దూసుకుపోవాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నించాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని స్థానాల్లో త‌మ అభ్య‌ర్థుల‌దే గెలుప‌ని ఇరు ప‌క్షాలూ చెప్ప‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఆత్మ‌కూరు, నెల్లూరు సిటీ, రూర‌ల్, సర్వేప‌ల్లి, కోవూరు, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ ఖాతాలోకేన‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, వైసీపీ నాయ‌కులు గుండుగుత్తుగా త‌మ‌కే ఓటింగ్ జ‌రిగింద‌ని నెల్లూరు క్లీన్ స్వీప్ చేస్తామ‌ని అంటున్నారు. మ‌రి ఇక్క‌డ జ‌న‌సేన‌పై పెద్ద‌గా అంచ‌నాలు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక వాస్త‌వంగా చూసినా జిల్లాలో వైసీపీకి స్పష్ట‌మైన ఆధిక్యం క‌న‌ప‌డుతోంది. మ‌రి ఫ‌లితాల్లో ఎలా ఉంటుందో ? చూడాలి.

నెల్లూరులో ఎవ‌రి బ‌లం ఎంత‌…. ఎవ‌రి లెక్క‌లేంటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts