గాజువాక ,భీమవరంలో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి

May 23, 2019 at 5:15 pm

జనసేన అధినేత పవన్‌క‌ళ్యాణ్‌ ఘోర పరాభవం చెందారు. ఎన్నో ఆశ‌ల‌తో ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌వ‌న్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవ‌డం ఒక ఎత్తు అయితే…తాను స్వ‌యంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయ‌న ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు చోట్లా వైసీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు. ప‌వ‌న్ ఈ ఎన్నిక‌ల్లో త‌న సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమవరం, విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేశారు. గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు.

ఇక భీమ‌వ‌రంలో వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. ఏపీలో మొదటి సారి ఎన్నికల్లో దిగిన జనసేన ఒక్క ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. పవన్ ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పవన్ అసెంబ్లీలో అడుగు పెడుతారని జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. జనసేనకు మెగాస్టార్‌ పీఆర్పీ కంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో జనసేన శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.

గాజువాక ,భీమవరంలో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts