జ‌న‌సేన ఘోర ఓట‌మి వెనుక “కాపు” దెబ్బ !

May 25, 2019 at 2:43 pm

ఎంత లేద‌ని చెప్పినా.. రాజ‌కీయాల‌కు కులాల‌కుమ‌ధ్య ఉన్నఅనుబంధం, సంబంధాల‌ను ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. ఎం త స‌మ‌తుల్యం పాటించాల‌ని అనుకున్నా కూడా.. రాజ‌కీయాల్లోకులాల కుంప‌ట్లు క‌నిపిస్తూనే ఉంటాయి. ఇలానే ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లోనూ కులాల పాలిటిక్స్ బాగానే గ‌డిచాయి. న‌డిచాయి. ముఖ్యంగా ప్ర‌ధాన పార్టీలు మూడూ కూడా మూడు ప్ర‌ధాన కులాల‌కు సంబంధించిన‌వే కావ‌డంతో ఇక్క‌డ ప్ర‌జ‌లుకూడా మూడు వ‌ర్గాలుగా చీలి పోయి ఉంటార‌నే ప్ర‌చారం సాగింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌మ్మ‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం తెలిసిందే.

ఇక‌, వైసీపీ అధినేత రెడ్డి వ‌ర్గానికి, మూడో పార్టీ జ‌న‌సేన అధినేత కాపు వ‌ర్గానికి చెందిన నాయకుడు కావ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయాలు కులాల ప్రాతిప‌దిక‌నే న‌డుస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా మూడో పార్టీగా అవ‌త‌రించిన జ‌న సేన ఈ ఎన్నిక‌ల్లో కాపుల ఓట్ల‌ను కైవ‌సం చేసుకుని అధికారాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంద‌ని అంద‌రూ అనుకు న్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. త‌నకు కులాలతో ప‌నిలేద‌ని చెప్పినా.. కూడా తాను ఎంచుకుని మ‌రీ కాపు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పోటీ చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం, విశాఖ జిల్లాలోని గాజు వాక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ పోటీ చేశారు.

అయితే, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేనాని ఓడిపోయారు. అదేవిధంగా త‌న సోద‌రుడు నాగ‌బాబును భీమ‌వ‌రం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. కాపుల ఓట్లు అత్య‌ధికంగా ఉండ‌డం, త‌న హీరోయిజం త‌న‌ను , త‌న పార్టీ నేత‌ల‌ను కూడా గెలిపిస్తుంద‌ని భావించ‌డం ప‌వ‌న్ను తీవ్ర‌స్థాయిలో ఇబ్బందికి గురి చేసింది. కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం రోడ్డెక్కిన‌ప్పుడు చంద్ర‌బాబుతో స‌ఖ్య‌తగానే ఉన్న ప‌వ‌న్ ఈ విష‌యంలో ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. పైగా త‌న‌కు కులం లేద‌నిత‌ప్పించుకున్నాడు. ఇక‌, కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంపై క‌నీసం మాట మాత్రంగా కూడాఆ య‌న స్పందించ‌లేదు. దీంతో సొంత సామాజిక వ‌ర్గం కూడాఆయ‌న‌కు దూరంగా జ‌రిగింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా జ‌న‌సేన‌ను ఒంట‌రిని చేసింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి జ‌న‌సేన ఘోర ఓట‌మి వెనుక ప‌వ‌న్ వేసిన త‌ప్ప‌ట‌డుగులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

జ‌న‌సేన ఘోర ఓట‌మి వెనుక “కాపు” దెబ్బ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts