ప్రభాస్,వంశి పైడిపల్లి బిగ్ అనౌన్స్మెంట్

May 22, 2019 at 3:37 pm

మ‌హ‌ర్షి సినిమా హిట్‌తో మంచి జోష్ మీదున్న ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. మ‌హ‌ర్షి ఇచ్చిన విజ‌యంతో మ‌రో కొత్త ప్రాజెక్టుకు సిద్ద‌మ‌వుతున్నాడు వంశీ. ఇప్పుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కోసం ఓ కొత్త క‌థ‌ను త‌యారు చేసే ప‌నిలో ఉన్నాడ‌ట వంశీ. ప్ర‌భాస్‌తో సినిమా తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వంశీ పైడిపల్లి ట్విట్ట‌ర్‌లో తెలిపాడు.

వంశీ పైడిప‌ల్లి తెలుగు సినిమాలోకి ప్ర‌భాస్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. 2007లో మున్నా సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందింది. ఈ సినిమా వంశీ పైడిప‌ల్లికి మొద‌టి సినిమా. ఇప్పుడు ప్ర‌భాస్‌తో ఓ కొత్త క‌థ‌ను త‌యారు చేస్తున్నాన‌ని ఆయ‌నే స్వ‌యంగా తెలుప‌డం విశేషం. వంశీ పైడిప‌ల్లి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని తెలిపాడు.

బాహుబ‌లి2 త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఏ చిత్రం ఇంత వ‌ర‌కు తెలుగు తెర‌పై ఆడ‌లేదు. బ‌హుబ‌లి త‌ర్వాత నిర్మిత‌మ‌వుతున్న సాహో సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈనెల 21న సాహో సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్ర‌భాస్ విడుద‌ల చేసిన మ‌రుస‌టి రోజునే వంశీ పైడిప‌ల్లి కొత్త సినిమా గురించి ప్ర‌క‌టన చేయ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆనంద‌డోలిక‌ల్లో మునిగి తేలుతున్నారు. ఇంత‌కు ప్ర‌భాస్ స్టామినాకు త‌గిన‌ట్లుగా క‌థ ఉంటుందా అనేది త్వ‌ర‌లో తేల‌నున్న‌ది.

ప్రభాస్,వంశి పైడిపల్లి బిగ్ అనౌన్స్మెంట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts