“ఆటోజానీ”గా రామ్‌చర‌ణ్‌..దర్శకుడు ఎవరంటే?

May 22, 2019 at 11:27 am

ఇద‌ర్ కా మాల్ ఉద‌ర్‌… ఉద‌ర్ కా మాల్ ఇద‌ర్ అనే డైలాగ్ ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుండే ఉంటుంది. బాక్స్ బ‌ద్ద‌లై పోద్దీ అనే డైలాగ్ కూడా అంద‌రికి తెలిసిందే.. ఈ రెండు డైలాగ్‌లు తెలుగు ఇండ‌స్ట్రీని ఒక‌ప్పుడు షేక్ చేశాయి. ఈ డైలాగ్‌లు భారీ వ‌సూళ్ళ‌తో బాక్సాఫీసును బ‌ద్ద‌లు చేశాయి. ఇంత‌కు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే… ఈ రెండు డైలాగ్‌లు మ‌న ఆటోజానీగా న‌టించిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనివి. ఇంత‌కు సినిమా పేరు మీకు తెలిసిపోయి ఉంటుంది… ముంబాయిలో ఆటో తోలుకుంటూ జీవ‌నం సాగించే ఆటోజానీ గా చిరంజీవి నటించిన రౌడి అల్లుడు సినిమాలోని పాత్ర పేరు.

ఇప్పుడు మెగాస్టార్ న‌టించిన పాత్ర‌పేరుతో ఆయ‌న కొడుకు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ఆటోజానీగా రాబోతున్నాడని టాలీవుడ్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఈ సినిమాలో న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ త‌న షూటింగ్ అయిపోయే ద‌శ‌కు వ‌చ్చింద‌ని టాక్‌. ఈ సినిమా పూర్తి కాగానే త‌ను మ‌రికొన్ని సినిమాల‌కు సైన్ చేయ‌నున్నాడు. అందులో ఈ ఆటోజానీ సినిమా ఒక‌టి.

ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పూరీ ప్ర‌స్తుతం రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను రూపొందించి టీజ‌ర్ విడుద‌ల చేశాడు. ఈ సినిమా స‌క్సెస్‌పై ఆటోజానీ ప్రాజెక్టు ఆధార‌ప‌డి ఉంద‌ట‌. కొస‌మెరుపు ఎంటంటే చిరంజీవి రీ ఎంట్రీగా వ‌చ్చిన 150 వ చిత్రంగా పూరీ జ‌గ‌న్నాథ్ చిరుతో ఆటోజానీ చేయాల‌ని క‌థ సిద్ధం చేశాడు. కానీ సెకండాఫ్ స‌రిగా కుదుర‌లేని దాన్ని ప‌క్క‌న పెట్టాడు. ఆ క‌థ‌ను విన్న రామ్‌చ‌ర‌ణ్ త‌న తండ్రిని హీరోగా కాకుండా తానే హీరోగా న‌టించాల‌నే ఆలోచ‌న లో ఉన్నాడ‌ట‌. అంటే తండ్రి కాద‌న్న క‌థ‌ను త‌న‌యుడు టేకోవ‌ర్ చేయ‌బోతున్నాడ‌ని సిని వ‌ర్గాల క‌థ‌నం. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగిగే ఈ సినిమా త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు స‌మాచారం.

“ఆటోజానీ”గా రామ్‌చర‌ణ్‌..దర్శకుడు ఎవరంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts