బ్రేకింగ్ …సాహూ రీషూట్ !

May 7, 2019 at 10:37 am

సాహొ.. బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న యాక్ష‌న్ చిత్రం. యూవీ క్రియేష‌న్స్‌, టీ సిరీస్‌, ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో ప్ర‌భాస్‌కు జోడిగా శ్ర‌ద్ధ‌క‌పూర్ న‌టిస్తోంది. ఈ సినిమాను ప్ర‌భాస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ప్ర‌తీ స‌న్నివేశాన్నిస‌వాల్‌గా తీసుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఇందులోని యాక్ష‌న్‌ స‌న్నివేశాలు ఉంటాయ‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన హాట్‌టాపిక్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది.

సుమారు రూ.300కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు 15న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది కూడా. ఇటీవ‌ల ముంబాయిలో షెడ్యూల్ జ‌రిగింది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు తెర‌కెక్కించిన ప‌లు స‌న్నివేశాల‌ప‌ట్ల హీరో ప్ర‌భాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాలు స‌రిగ్గా రాలేద‌ని అంటున్నాడ‌ట‌. దీంతో ఆయ‌న ఆయా స‌న్నివేశాల‌ను రీ షూట్ చేయాల‌ని ప్ర‌భాస్ అంటున్నట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే.. హాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ కెన్నీ బేట్స్ రూపొందించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ప్ర‌భాస్ చాలా ఇష్ట‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య తెర‌కెక్కించిన ప‌లు స‌న్నివేశాలు మాత్రం ప్ర‌భాస్‌కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో వాటిని రీషూట్ చేయాల‌ని ప్ర‌భాస్ అంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే సాహొ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఇది కొంత నిరాశ క‌లిగిస్తోంది. ఎందుకంటే.. రీషూట్ అంటే మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌న్న ఆందోళ‌న‌లో వారు ఉన్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

బ్రేకింగ్ …సాహూ రీషూట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts