బైక్‌పై దూసుకుపోతున్న సాహో…. రెండో పోస్ట‌ర్ విడుద‌ల

May 27, 2019 at 3:07 pm

సాహో టీం మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. యూవీ క్రియోష‌న్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ బైక్‌పై రివ్వుమ‌ని దూసుకుపోతున్న పోస్ట‌ర్ నెట్టింట్లోకి విడుద‌ల చేశారు. బ‌హుబ‌లి త‌రువాత రూపొందుతోన్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమా సాహో. బ‌హుబ‌లి 2 త‌రువాత ప్ర‌భాస్ నుంచి ఎలాంటి సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు సాహో సినిమా రాక‌కోసం వెయ్యి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా సాహో విడుద‌ల అని ఆయ‌న ఆభిమానులు ఎదురు చూస్తున్న ఈ త‌రుణంలో ఈనెల 21న ప్ర‌భాస్ సాహో చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌గా, సోమ‌వారం సాహో రెండో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

బాహుబ‌లి త‌రువాత భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ఈ సాహో సినిమాను అభిమానులు చాలా గొప్ప‌గానే రీసివ్ చేసుకున్నారు. ఫ‌స్ట్‌లుక్‌తోనే అద‌రగొట్టిన ప్ర‌భాస్ ఇప్పుడు రెండో లుక్ విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ బైక్‌పై ర‌య్యిమ‌ని దూసుకుపోతున్నారు. ఈ పోస్ట‌ర్ ను ట్విట్ట‌ర్‌, ఇన్ స్ట్రాగ్రామ్‌లో విడుద‌ల చేశారు. సాహో ఫ‌స్ట‌లుక్‌ను మొద‌టి రోజే 9ల‌క్ష‌లుకు పైగా లైక్‌లు చేయ‌డం తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ స‌రికొత్త రికార్డుగా చెప్పుకుంటున్నారు.

భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఈ సాహో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక సినిమానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకొని ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు మూహుర్తం ఖారారు చేశారు చిత్ర ద‌ర్శ‌కుడు సుజిత్‌. హాలీవుడ్ రేంజ్‌లో నిర్మాణం జ‌రుపుకుంటుంది. ఎన్నో అంచనాల‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కే ఇంత క్రేజీ ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో వేచీ చూడాల్సిందే మ‌రి. ఏదేమైనా ప్ర‌భాస్ సినిమా అంటే మ‌రో బాహుబ‌లి అని అనుకుంటున్నారు అభిమానులు. మ‌రి అభిమానుల అంచ‌నాల‌ను అందుకుంటుకుంటుంద‌ని, దానికి నిద‌ర్శ‌నం ఈ పోస్ట‌ర్ విడుద‌ల‌కు వ‌చ్చిన స్పంద‌నే తెలుపుతుంద‌ని సిని వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నారు.

బైక్‌పై దూసుకుపోతున్న సాహో…. రెండో పోస్ట‌ర్ విడుద‌ల
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts