మ‌రో ప్రేతాత్మ సినిమాలో స‌మంత‌

May 22, 2019 at 3:08 pm

రాజు గారి గ‌ది 2 సినిమాలో న‌టించిన స‌మంత ఇప్పుడు మ‌రో ప్రేతాత్మ క‌థ‌తో తెలుగు ప్రేక్ష‌కులు ముందుకు రాబోతున్నారు. ఇటీవ‌ల స‌మంత త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌టించిన చిత్రం మ‌జిలి. ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. త‌రువాత స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి విదేశీయానంలో ఉన్నారు. ఇప్పుడు స‌మంత న‌టించ‌బోయే సినిమా గురించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌డం విశేషం.

ద‌గ్గుబాటి రామానాయుడు నెల‌కొల్పిన సురేష్ ప్రోడ‌క్ష‌న్స్ సంస్థ ఇప్ప‌టికి 55 ఏండ్ల‌ను పూర్తి చేసుకుంది. ఈ ఐదున్న‌ర ద‌శాబ్ధాల సిని ప్ర‌యాణంలో వంద‌ల కొల‌ది సినిమాల‌ను నిర్మించిన సంస్థ భార‌త దేశంలోనే లేదంటే అతిశ‌యోక్తి కాదు. రామానాయుడు మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న కుమారుడు ద‌గ్గుబాటి సురేష్ బాబు ఇదే సంస్థ‌పై అనేక సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇపుడు 55 వ‌సంతాలు పూర్తి అయిన నేప‌థ్యంలో స‌మంత‌తో ఓహ్ బేబీ సినిమాకు ప్లాన్ చేసుకున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్‌.

సురేష్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా ఓహ్ బేబీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో స‌మంత తెల్ల టాప్‌తో లాంగ్ ఫ్రాక్ వేసుకొని న‌వ్వుతున్న నిలువెత్తు పోటోను బ్యాక్‌డ్రాప్‌లో న‌టి ల‌క్ష్మీ ఉన్న ఫోటోతో ఎంతో ఆస‌క్తి క‌లిగేలా రూపొందించారు. ఈ సినిమాలో స‌మంత స్వాతి పాత్ర‌లో న‌టిస్తార‌ట‌. ల‌క్ష్మీ70ఏండ్ల వృద్దురాలిగా న‌టించనున్నార‌ని, ల‌క్ష్మీ మ‌ర‌ణించి ఆత్మ‌గా మారి 20ఏండ్ల స‌మంత‌లో ప్ర‌వేశిస్తే జ‌రిగే సంఘ‌ట‌న‌లను సినిమాగా తీస్తున్నార‌ట‌. ఈ సినిమా సౌత్ కొరియ‌న్ చిత్రం మిస్ గ్రానీ అనే చిత్రానికి అనువాదంగా వ‌స్తుంది. సినిమాలో నాగ‌శౌర్య‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఊర్వ‌శీ, రావు ర‌మేష్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్‌, జూనియ‌ర్ న‌టులు న‌టించ‌నున్నారు.

మ‌రో ప్రేతాత్మ సినిమాలో స‌మంత‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts