హీరోయిన్ సమీరారెడ్డి పై లైంగిక వేధింపులు

May 7, 2019 at 3:22 pm

సినీ ప‌రిశ్ర‌మలో ఆడ‌వారి ప‌ట్ల అనుస‌రిస్తున్న విధానాలు మారాలి. అవ‌కాశాలు ఇచ్చి వారి నుంచి ఏదో కోరుకునే సంస్క్రుతి పోవాలి అని న‌టి స‌మీరారెడ్డి అన్నారు. ప‌రిశ్ర‌మలో ఇప్ప‌టికీ వేధింపులు ఉన్నాయ‌ని స‌మీరా బాంబ్ పేల్చారు. కొద్ది సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ర్టీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు ఊహించ‌నంత లావైంద‌ని వ‌స్తున్న ట్రోల్స్‌తో ఈ మ‌ధ్య మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చారు స‌మీరారెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌రిశ్ర‌మ‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం స్రుష్టిస్తున్నాయి.

2014 వ‌ర‌కు ఇండ‌స్ర్టీలో బిజీబిజీగా గ‌డిపిన ఆ తార ఆ త‌ర్వాత పారిశ్ర‌మిక వేత్త అక్ష‌య్‌వార్డెను పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. కేవ‌లం కుటుంబంతోనే గ‌డుపుతూ ప‌రిశ్ర‌మ‌కు గ్యాపిచ్చారు. ఇప్పుడు ప్ర‌స్తుతం రెండో సారి త‌ల్లి కాబోతున్నీ ఈ అమ్మ‌డి బ‌రువు పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తుండ‌డంతో మ‌ళ్లీ త‌న వాయిస్‌ను వినిపించ‌డానికి స‌మీరా బ‌య‌ట‌కొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన ప‌లు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

సినీ ప‌రిశ్ర‌మలో ఇంకా మార్పులు రావాల‌ని కోరుతున్నాన‌న్నారు. అవ‌కాశాలు ఇచ్చి ఆడ‌వారిని ప‌డ‌క సుఖాలు ఇవ్వాల‌ని కోరే సంస్క్రుతి పోవాల‌న్నారు. మ‌హిళ‌ల‌ను వాడ‌క‌పు వ‌స్తువుగా చూసే కాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల‌ని కోరారు. ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు కూడా ఇలాంటి అనుభ‌వాలు ఎదురయ్యాయ‌న్నారు. ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నించే స‌మ‌యంలోనే కాకుండా ఒక స్థాయికి చేరుకున్న త‌ర్వాత కూడా త‌న‌కు ఇలాంటి వేధింపులు త‌ప్ప‌లేద‌ని పేర్కొన్నారు. ప‌లురకాలుగా త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని వెల్ల‌డించారు. **మీటూ** తో ఇప్పుడిప్పుడే మార్పు దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని ఆమె తెలియ‌జేశారు.

హీరోయిన్ సమీరారెడ్డి పై లైంగిక వేధింపులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts