టీవీ 9 కేసు పై వీడియో విడుదల చేసిన శివాజీ

May 18, 2019 at 3:55 pm

టీవీ9 వ్య‌వ‌హారంలో నేను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, అయినా త‌న‌పై కౌశిక్‌రావు కేసు వేయ‌డం ఏమిట‌ని హీరో శివాజీ ప్ర‌శ్నించాడు. టీవీ9 కొనుగోలు వ్య‌వ‌హారంలో మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్‌, హీరో శివాజీల‌పై సంస్థ కొత్త యాజమాన్యం క్రిమిన‌ల్ కేసులు పెట్ట‌డం, ఇరువురు ఇండ్ల‌పై దాడులు చేయ‌డం, విచార‌ణ‌కు రావాలంటూ పోలీసులు నోటీసులు పంప‌డం, వాటికి స్పందిస్తూ 10 రోజులు స‌మ‌యం కోర‌డం, అవి గ‌డువు ముగిసినా విచార‌ణ‌కు రాక‌పోవ‌డం, మళ్ళీ పోలీసులు నోటీసులు పంప‌డం, ర‌విప్ర‌కాశ్‌, శివాజీలు రాక‌పోగా మ‌రో 10 రోజులు స‌మ‌యం కావాల‌ని కోర‌డం జ‌రిగిన ఎఫిసోడ్ అంతా తెలిసిందే.

ఇంత ఎపిసోడ్ జ‌రుగుతున్న క్ర‌మంలో తెలంగాణ పోలీసులు జ‌ర్న‌లిస్టు ర‌విప్ర‌కాశ్‌, హీరో శివాజీల‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో స్పందించిన హీరో శివాజీ మొద‌టి సారి తాను ఓ వీడియోను విడుద‌ల చేశారు. వీడియోలో తాను టీవీ9లో ర‌వి ప్ర‌కాశ్‌కు చెందిన షేర్లు గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే కొన్నాన‌ని, అది ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఒప్పంద‌మ‌న్నారు. టీవీ9 యాజ‌మాన్యం మార‌డంతో ఆ షేర్లు నాపేరున బ‌దిలి కాక‌పోవ‌డంతో తిరిగి ఈ ఏడాది అడ‌గడం జ‌రిగింద‌న్నారు. ఈ వ్య‌వ‌హారం నాకు ర‌విప్ర‌కాశ్‌కు త‌ప్ప మూడో వ్య‌క్తి అయిన కౌశిక్‌రావుకు ఏమిటి సంబంధం అని ప్ర‌శ్నించారు.

నేను ర‌వి ప్ర‌కాశ్ టీవీ 9 కి సంబంధించిన షేర్ల కొనుగోలు ఒప్పందం కేవ‌లం సివిల్ పంచాయితీ అయితే కొత్త యాజ‌మాన్యం దాన్ని క్రిమిన‌ల్ పంచాయితీగా మార్చి మ‌మ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని వీడియోలో అన్నారు. తాను స్థానికుడిని కాద‌నే కోణంలో నాకు స్థాన బ‌లం లేద‌నే తెలంగాణ ప్ర‌భుత్వం, తెలంగాణ పోలీసులు నాపై అన‌వ‌స‌రమైన కేసులు పెడుతున్నార‌ని ఆరోపించాడు. వంద కేసులు కాదు, వెయ్యి కేసులైనా పెట్టుకోండ‌ని అన్నారు. తాను నాలుగు రోజుల్లో పోలీసుల ముందు హాజ‌రై అన్ని విష‌యాలు తెలుపుతాన‌న్నారు.

నేను అజ్ఞాతంలోకి పారిపోయాన‌ని నాపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. నేను ఎక్క‌డికి పారిపోలేద‌ని తిరుప‌తి వెళ్ళి మొక్కులు తీర్చుకున్నాన‌ని వివ‌రించారు. నాకు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో అనారోగ్యం కార‌ణంగా అందుబాటులో లేన‌ని అన్నారు. టీవీ 9 కొనుగోలు చేసిన జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు త‌నకు బాగా తెలుస‌ని, న‌న్ను పిలిచి అన్ని విష‌యాలు అడిగితే చెప్పే వాడిన‌ని, అయినా ఆయ‌న‌ను క‌లిసి వివ‌రిస్తాన‌ని వివ‌రించాడు. నాలుగు రోజుల్లో పోలీసుల ముందుకు వెళ్ళి నిజాయితీగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఏదేమైనా ఇంత‌కాలం గ‌ప్‌చుఫ్‌గా ఉన్న శివాజీ అజ్ఞాతం వీడి వీడియో ద్వారా త‌న స్పంద‌న‌ను తెలుపుడం విశేషం. వీడియోలో శివాజీ గుండుతో క‌నిపించాడం కొస‌మెరుపు.

టీవీ 9 కేసు పై వీడియో విడుదల చేసిన శివాజీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts