తెల్ల‌బామ‌లును ఎట్టకేలకు పట్టుకున్న రాజమౌళి

May 20, 2019 at 4:32 pm

ఆర్‌. ఆర్‌. ఆర్‌.. ఇది సినిమా టైటిల్ కాదు.. కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే. ఆర్ అంటే రాజ‌మౌళి, ఆర్ అంటే రామారావు, ఆర్ అంటే రాంచ‌ర‌ణ్‌, ఈ త్రిమూర్తులు క‌లిస్తే వ‌చ్చేది ఆర్‌. ఆర్.ఆర్‌. ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఎంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. డివివి దాన‌య్య నిర్మాత‌.

రూ.400కోట్ల భారీ బ‌డ్జ‌ట్‌తో వ‌స్తున్న ఈసినిమా షూటింగ్ పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది. ఆర్ ఆర్ ఆర్‌లో హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు హీరోయిన్ల‌ను వెతుకుతున్న క్ర‌మంలో చివ‌రాఖ‌ర‌కు ఇద్ద‌రు ఇంగ్లీష్ బామ‌ల‌కు దొర‌క‌బ‌ట్టార‌ట రాజ‌మౌళి. క‌థ డిమాండ్ మేర‌కు ఫారీన‌ర్ హీరోయిన్లు అయితే చ‌క్క‌గా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో రాజ‌మౌళి ఇద్ద‌రు తెల్ల‌వారిని హీరోయిన్లుగా ఎంపిక చేసిన‌ట్లు వినికిడి.

1920 కాలం నాటి బ్రిటీష్ పాల‌న‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. బ‌హుబ‌లి క‌న్నా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల అంత‌రాయాలు క‌లుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా బ్రిటీష్‌కు చెందిన ఎడ్గార్ జోన్స్‌ను గ‌తంలో తీసుకున్న‌ప్ప‌టికి ఆమే న‌టించ‌క‌పోవ‌డంతో కొత్త‌వారి కోసం వెతుకులాట ప్రారంభించి ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించార‌ట‌. క‌థ డిమాండ్ మేర‌కు ఎక్క‌డ కాంప్ర‌మైజ్‌కాకుండా రాజ‌మౌళి చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

తెల్ల‌బామ‌లును ఎట్టకేలకు పట్టుకున్న రాజమౌళి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts