అడ‌వుల్లో సుకుమార్‌.. ఎందుకంటే..?

May 7, 2019 at 3:38 pm

మెగా హీరో రామ్‌చ‌రణ్‌తో రంగ‌స్థ‌లం సినిమా తీసిన త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ మెగా కుటుంబంలోని మ‌రోహీరోతో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మెగా కుటుంబంలోని హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సుకుమార్ సిద్ద‌మ‌య్యార‌ని సినీ వ‌ర్గాల టాక్‌. సినిమా నిర్మాణానికి ముందు స‌న్నివేశాల కోసం లొకేష‌న్ బాట ప‌ట్టారు సుకుమార్‌. అందులో భాగంగా సుకుమార్ లొకేష‌న్ల కోసం అడ‌వుల బాట ప‌ట్టిన‌ట్లు సినీవర్గాలు అంటున్నాయి. ఈ సినిమా మొత్తం అడ‌వుల నేప‌థ్యంలో సాగుతుంద‌ని వినికిడి.

ప్ర‌ముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మాణ సార‌ధ్యంలో తిరుమ‌ల తిరుప‌తి అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. అందుకే తిరుమ‌ల తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఈ సినిమా షూటింగ్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమా స్థాయిలో ఈ సినిమా తీయాల‌ని అందుకు త‌గ్గ‌ట్టుగానే భారీ ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్టు సినివ‌ర్గాలు అంటున్నారు. అల్లు అర్జున్‌తో తీయ‌బోయే ఈ సినిమాకు ఈనెల‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది.

నిజానికి… ఈ సినిమాపై అనేక రూమ‌ర్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌తో మ‌హేశ్‌బాబుతో సినిమా తీయాల‌ని సుకుమార్ అనుకున్నాడు. కానీ.. ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. అదే క‌థ‌తో బ‌న్నీ హీరోగా సినిమా తీస్తున్న‌ట్లు సుకుమార్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్ట‌గానే.. సుకుమార్ సినిమాకు కొబ్బ‌రికాయ కొట్ట‌నున్నారు.

అడ‌వుల్లో సుకుమార్‌.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts