కేసీఆర్‌,జ‌గ‌న్‌ మ‌ధ్య‌లో స్వామీజీ

May 23, 2019 at 1:39 pm

ఇద్ద‌రు నాయ‌కులు, వీరి మ‌ధ్య‌లో ఓ స్వామీజీ! ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విష‌యం ఇదే. ఆయ‌న ఎవ‌రు? ఏం చేశారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ శార‌దాపీఠాధిప‌తి.. స్వ‌రూపానందేంద్ర స్వామీజీ. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇటు ఏపీకి కాబోయే సీఎం జ‌గ‌న్‌కు కూడా అత్యంత ఆత్మీయులు. అంతేకాదు, ఇద్ద‌రి మంచి చెడుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న స‌మీక్షించి హెచ్చ‌రించే స‌న్నిహితుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఎన్నిక‌లకు ముందు టీఆర్ ఎస్ సార‌థి కేసీఆర్ స్వామి చూపించిన బాట‌లోనే ఆధ్యామికంగా ముంద‌డుగు వేశారు.

అదేవిధంగా కేసీఆర్ మ‌రోసారి సీఎం కావాల‌నే ఉద్దేశంతో అనేక యాగాలు చేశారు. ముఖ్యంగా రాజ‌శ్యామ‌ల యాగం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వ‌రూపానందేంద్ర పేరుతెచ్చుకున్నారు. విజ‌యం సాధించేందుకు ఉన్న ఏకైక ఆధ్యాత్మిక మార్గాల్లో ఈ యాగం మహోన్న‌త‌మైంద‌ని చెప్పుకొచ్చిన ఆయ‌న అటు కేసీఆర్‌తోను, ఇటు జ‌గ‌న్‌తోనూ కూడా ఈయాగాలు చేయించారు. ఒక ప‌క్క నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ త‌న వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తూ.. ముందుకు సాగుతూనే.. ఈ ఇద్ద‌రు కూడా స్వామి చూపించిన మార్గంలో యాగాలు చేశారు. మ‌రి వారి కృషికి తోడు ఈ యాగాలు కూడా ఇప్పుడు స‌ఫ‌లీకృతం అయ్యాయా? వీరిద్ద‌రూ సాధించిన విజ‌యం వెనుక స్వామి ఉన్నాడా అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఎప్పుడు సీఎం కావాల‌నే విష‌యంలోనూ స్వామి కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు సీఎంగా ఎప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే స్వ‌రూపానందేంద్ర ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు నాయ‌కులు రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే స్వామి బాట‌లో విజ‌యాన్ని అందుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాబోయే రోజుల్లో మ‌రెన్ని సంచ‌ల‌నాల‌కు ఈ స్వామి కేంద్రం అవుతారో చూడాలి.

కేసీఆర్‌,జ‌గ‌న్‌ మ‌ధ్య‌లో స్వామీజీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts