సైరా తో వెంకీమామ సై…!

May 28, 2019 at 10:47 am

అక్కినేని నాగ చైత‌న్య అక్కినేని వార‌సుడిగా సిని రంగ ప్ర‌వేశం చేశాడు… విక్ల‌రీ వెంక‌టేశ్ ద‌గ్గుబాటి రామానాయుడు కొడుకుగా వెండితెర‌పై తెరంగ్రేటం చేశాడు. అక్కినేని నాగ‌చైత‌న్య అల్లుడు, విక్ట‌రీ వెంక‌టేశ్ మేన‌మామ‌.. ఇద్ద‌రు మామాఅల్లుండ్లు… ఇది రీల్ జీవితంలో పోషిస్తున్న పాత్ర‌లు, వ‌రుస‌లు కాదండీ సుమా.. . నిజ‌జీవితంలో ఇద్ద‌రు మామా అల్లుండ్లు… వెంక‌టేశ్ సోద‌రి – వెండితెర మ‌న్మ‌థుడు నాగ‌ర్జున‌ల ముద్దుల కొడుకు నాగ‌చైత‌న్య‌. అంటే నాగ‌చైత‌న్యకు వెంక‌టేశ్ మేమ‌మామ అవుతాడు ఇది నిజ‌జీవితంలో….

అదే మామా అల్లుండ్లు రీల్ జీవితంలోను మామా అల్లుండ్లుగా న‌టించ‌బోతున్నారు. నిజ‌జీవిత పాత్ర‌ల‌ను రీల్ జీవితంలోను నిజం చేయ‌బోతున్నారు. అందుకు వెంకీమామ పేరుతో తెర‌కెక్కుతున్న చిత్రంలో మామ‌గా వెంక‌టేశ్‌, అల్లుడుగా నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా రాబోతోంది.. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాను నాగ‌చైత‌న్య పెద్ద‌మామ సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తుంది. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వెంకీమామ‌కు జోడిగా పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న అందాల‌ను అర‌బోసేందుకు సిద్ధం కాగా, అల్లుడికి జోడిగా అందాల రాశీ రాశీఖ‌న్నా జోడీ క‌ట్టింది.

ఇంత‌కు చెప్పోచ్చెదెమంటే మామ అల్లుండ్లు ఇప్పుడు మంచిజోరు మీదున్నారు… మ‌జిలి విజ‌యంతో నాగ‌చైత‌న్య‌, ఎఫ్‌2 బ్లాక్‌బ్ల‌స్ట‌ర్‌తో వెంక‌టేశ్‌లు హుషారుగా ఉండ‌గా అదే హుషారుతో సైరాతో పోటి ప‌డ‌బోతున్నారే వార్త సిని వ‌ర్గాల్లో చెక్క‌ర్లు కొడుతోంది… మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా సినిమాను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌న‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించి ఆ మేర‌కు ఉరుకులు ప‌రుగుల మీద సినిమాను పూర్తి చేస్తున్నారు. అదే అక్టోబ‌ర్ 13న వెంకీమామ‌ను విడుద‌ల చేయాల‌ని సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వినికిడి. ఇదే నిజ‌మైతే సైరాతో వెంకీమామ సై అంటున్న‌ట్లేన‌ని సిన వ‌ర్గాల టాక్‌. ఏదేమైనా రాబోవు రోజుల్లో మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ పోటీలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో వేచీ చూడాల్సిందే మారి.

సైరా తో వెంకీమామ సై…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts