ఆ రెండు ఆప్ష‌న్లే బాబు ల‌క్ష్యం.. !

May 18, 2019 at 2:11 pm

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టానికి మ‌రో ఐదు రోజుల్లో తెర‌లేవ‌నుంది. గత నెల 11న జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు తెలిసేందుకు మ‌రో ఐదు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అధికారంలోకి తిరిగి వ‌స్తార ని ఎంత‌మంది చెబుతున్నారో.. అంతే సంఖ్య‌లో ఆయ‌న అదికారం కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యం లో చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి వ‌స్తే. మంచిదే.. రాక‌పోతే.. ఏంటి? ఆయ‌న‌, ఆయ‌న అనుచరుల ప‌రిస్తితి ఎలా ఉం టుంది? ఇప్పుడు రాజ‌సం అప్పుడు కూడా కొన‌సాగుతుందా? లేక ఇబ్బందులు ఎదుర్కొన‌క త‌ప్ప‌దా? అనే ప్ర‌శ్న‌లు తెర మీదికి వ‌స్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లోనే అధికారంలోకి వ‌స్తాన‌ని భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కొద్ది తేడాతో ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆయ‌న అనుచ‌రుల నుంచి తీవ్ర అవ‌మానాలు, వేధింపులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో క‌నీసం మాట్లాడేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు. అదేస‌మయంలో చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రం ప‌ఠించి వైసీపీ నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. దీంతో వైసీపీ అధినేత‌లో స‌హ‌జంగానే క‌సి పెరిగింది. తాను అధికారంలో కి వ‌స్తే.. త‌ను ఎలాంటి మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించాడో.. అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు కూడా వేధించేలా చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకోవ‌డం ఆశ్చ‌ర్యం కాదు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు.

ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత వ‌చ్చిన అనేక స‌ర్వేల‌ను అధ్య‌యనం చేసిన చంద్ర‌బాబు.. త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టా రు. ఈ క్ర‌మంలోనే త‌న‌ముందు రెండు ఆప్ష‌న్లు పెట్టుకున్నారు. ఒక‌టి గెలిస్తే.. ఏ గొడ‌వా లేదు. తిరిగి మ‌ళ్లీ ఐదేళ్ల పాటు రా ష్ట్రంలో చ‌క్రం తిప్ప‌వ‌చ్చు. తన కుమారుడిని డిప్యూటీ సీఎంను చేయొచ్చు. ఒక‌వేళ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. ఏం చేయాలి? అనే విష‌యంపై కూడా చంద్ర‌బాబు క్లారిటీగా ఉన్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక త‌న‌పై ఏదో ఒక రూపంలో క‌సి తీర్చుకుంటార‌ని బాబు భావిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే జ‌గ‌న్ కొన్ని కీలక వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌పై త‌మ‌కు స‌హా ప్ర‌జ‌ల‌కు కూడా అనుమానాలు ఉన్నాయ‌ని, తాము అధికారంలోకి వ‌స్తే.. విచార‌ణ చేయిస్తామ‌ని చెప్పుకొచ్చారు.

అదేవిధంగా పోల‌వరం అంచ‌నాల పెంపు, ప‌ట్టిసీమ నిర్మాణంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, చంద్ర‌బాబు త‌న వారికి అమ రావతిలో పందేరం చేసిన భూములు వంటి విష‌యాల‌పై విచార‌ణ‌కు ఆదేశించి ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంది. దీనిని ముందుగానే ఊహించిన బాబు.. త‌న ప్లాన్‌-2ను ముందుగానే అమ‌లు చేస్తున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోడీ రాకుండా చేసుకుంటే.. ప్రాంతీయ పార్టీలు బ‌ల‌ప‌రిచిన కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. త‌న‌పై ఈగ‌వాల‌ద‌ని బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాల్లో తిరిగి ఆయా ప్రాంతీయ పార్టీల‌ను బ‌లోపేతం చేస్తున్నారు. రేపు ఒక‌వేళ జ‌గ‌న్ త‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించినా.. ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌గ‌ట్టి.. పోరు చేయాల‌నేది బాబు ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో బాబు ప్లాన్ ఏమవుతుందో చూడాలి.

ఆ రెండు ఆప్ష‌న్లే బాబు ల‌క్ష్యం.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts