టాలీవుడ్ సీనియ‌ర్ క‌మేడియ‌న్ మృతి

May 18, 2019 at 10:38 am

తెలుగు చిత్ర సీమ‌లో సీనియ‌ర్ క‌మేడియ‌న్ న‌టుడు రాళ్ళ‌ప‌ల్లి. టాలీవుడ్‌లో న‌టించిన పెద్ద చిన్నా అనే తేడా లేకుండా దాదాపు అంద‌రు హీరోల సినిమాల్లో హ‌స్య‌న‌టుడుగా న‌టించిన న‌టుడు రాళ్ళ‌ప‌ల్లి. త‌న హ‌స్య న‌ట‌త‌నో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించిన ఈ న‌వ్వుల రారాజు ఇక లేరు అనే స‌త్యంను అభిమానులు జీర్ణించుకోలేని ప‌రిస్థితి. రాళ్ళ‌ప‌ల్లి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయ‌న మృతి అభిమానుల‌కు తీర‌ని లోటును, సిని ప‌రిశ్ర‌మ‌కు వెలితిని మిగిల్చింది.

1955 అక్టోబ‌ర్ 10 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కంబ‌దూర్‌లో జ‌న్మించాడు. చిన్న‌నాటి నుంచే నట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న రాళ్ళ‌ప‌ల్లి పూర్తిపేరు రాళ్ళ‌ప‌ల్లి వెంక‌ట న‌ర‌సింహ‌రావు. ఇంటిపేరునే త‌న పేరుగా మార్చుకొని సినిమాల్లో రాణించాడు. చిన్న‌నాటి నుంచే నాట‌కాలు రాస్తూ, అందులో న‌టించేవాడు ఆయ‌న‌. సుమారు 8వేల కు పైగా నాట‌కాల్లో న‌టించిన రికార్డు ఆయ‌న సొంతం. కాగా తానే రాసుకొని త‌నే అందులో న‌టించేవాడ‌ట రాళ్ళ‌ప‌ల్లి.

నాట‌కాల‌పై ఉన్న మ‌క్కువ‌తో మ‌ద‌రాస్ చేరుకొని సినిమాల్లో అవ‌కాశాలు పొందాడు రాళ్ళ‌ప‌ల్లి. 1979లో చిరంజీవి న‌టించిన కుక్క‌కాటుకు చెప్పు దెబ్బ సినిమా ద్వారా సిని రంగ ప్ర‌వేశం చేశారు అ సీనియ‌ర్ న‌టుడు. అదే ఏడాది తూర్పు వెళ్ళె రైలు, కంచికి చేర‌ని క‌థ సినిమాలో న‌టించి అల‌రించాడు. ఇక త‌న న‌ట‌న‌తో మెప్పించి ఇక వెనుదిరిగి చూడ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 850కి పైగా చిత్రాల్లో అనేక పాత్ర‌లో న‌టించాడు. ఈ పాత్ర రాళ్ళ‌ప‌ల్లి అయితేనే కుదురుతుంది అనే స్థాయికి చేరుకున్నాడు.

త‌న న‌ట‌న‌తో ఎంద‌రో ద‌ర్శ‌కులు, హ‌స్య న‌టులు, హీరోల తో శ‌భాష్ అనిపించుకున్నారు. అనేక మంది హ‌స్య న‌టుల‌కు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి వారితో చ‌నువుగా ఉంటూ వారికి మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉన్నాడు. జంద్యాల‌, వంశీ, కె.విశ్వ‌నాథ్ వంటి అగ్ర‌ద‌ర్శ‌కుల‌తో స‌మానంగా ఘ‌న‌త‌ను పొందాడు. ఐదుసార్లు నంది అవార్డుల‌ను సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా అనేక అవార్డులు , రివార్డులు పొందాడు. తాను అనారోగ్యం భారిన ప‌డేంత వ‌ర‌కు టీవీ షోలు, సిరియ‌ల్స్‌లో న‌టిస్తూనే ఉండేవాడు. డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ప‌నిచేశాడు. రాళ్ళ‌ప‌ల్లి నేచుర‌ల్ స్టార్ నానీ న‌టించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే సినిమాలో రాళ్ళ‌పల్లి చివ‌రిసారిగా న‌టించాడు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన రాళ్ళ‌ప‌ల్లి శుక్ర‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మృతిప‌ట్ల సిని హీరోలు, ద‌ర్శ‌క‌లు, స‌హాచ‌ర న‌టులు, ప్ర‌ముఖులు, అన్ని రంగాల‌కు చెందిన వారు సంతాపం తెలుపుతున్నారు.

టాలీవుడ్ సీనియ‌ర్ క‌మేడియ‌న్ మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts