అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్!

May 20, 2019 at 4:45 pm

చిత్ర ప‌రిశ్ర‌మంలో ఒక్కోక్క‌రిది ఒక్కో సెంటిమెంట్‌.. హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎవ‌రు అనే తేడాలేకుండా ప్ర‌తి ఒక్క క‌ళాకారుడు సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. వాళ్ళ జాబితాలో త్రివిక్ర‌మ్ చేరాడు. ఆయ‌న కూడా సెంటిమెంట్స్‌ను బాగా న‌మ్ముతాడు. ఆ సెంటిమెంట్ ఏంట‌నే క‌దా మీ డౌట్‌. . ఆయ‌న సెంటిమెంట్ ఎందంటే ఒక సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు.

త్రివిక్ర‌మ్ సినిమా ఏదైనా ఇద్ద‌రు హీరోయిన్ల‌ను పెట్ట‌డం ఆన‌వాయితీ. ఈ ఆన‌వాయితీ ప్ర‌కారం ఇప్ప‌డు త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం తీయ‌బోతున్న సినిమాలోను అదే ఫాలో అవుతున్నాడ‌ట‌. మెగా హీరో అల్లు అర్జున్‌తో తీయ‌బోయే సినిమాలో ఇద్దరు హీరోయిన్ల‌ను ఎంపిక చేశాడ‌ట‌.

గీతా ఆర్ట్స్ తో క‌లిసిన త‌న సొంత సిని నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియోష‌న్స్ సంస్థ సంయుక్తంగా అల్లు అర్జున్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు త్రివిక్ర‌మ్‌. ఫ్యామిలి డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డేను తీసుకున్నార‌ట‌. ఇప్ప‌డు రెండో హీరోయిన్‌గా కేటికా శ‌ర్మ తీసుకున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఇందులో కీల‌క పాత్ర‌ల్లో నివేదా థామ‌స్‌, బోమ‌న్ ఇరానీ, ట‌బు తో పాటు ప‌లువురు సీనియ‌ర్లు న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాకు నాన్న నేను, అల‌క నందా అనే పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వినికిడి.

అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts