మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన టీఆర్ఎస్ మంత్రి

May 11, 2019 at 2:19 pm

మంత్రుల చిత్రాలు క‌డు చిత్రంగా ఉంటాయ‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎన్నిక‌ల వేళ దేశ‌వ్యాప్తంగా అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నాయ‌కులు త‌మ చిత్తానికి త‌గిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తూ.. వార్త‌ల్లోనిలుస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కొక్క పంథాలో ముందుకు సాగుతూ.. ప్ర‌జ‌లకు వినోదాన్ని పంచుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓటు వేసిన త‌ర్వాత వేలిపై సిరా చుక్క‌తో గుర్తు వేయ‌డం తెలిసిందే. ముఖ్యంగా ఎమ్మెల్యే ఓటింగ్ స‌యమ‌యంలో కుడి చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేస్తారు. ఇక‌, సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎడ‌మ చేతి చూపుడు వేలుకు ఈ సిరా చుక్క చేరుతుంది.

మొత్తానికి ఈ సిరా గుర్తు కార‌ణంగా మ‌ళ్లీ మ‌ళ్లీ పోలింగ్‌లో పాల్గొన‌కుండా, దొంగ ఓట్లు వేయ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ డంలో భాగంగా ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసిన ఈ విధానం అంద‌రికీ తెలిసిందే. అయితే, ఘ‌న‌త వ‌హించిన మంత్రు లు కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన వేలుపై ఈ సిరాగుర్తు ను వేయించుకుని ఎన్నిక‌ల స‌ర‌ళినే న‌వ్వుల పాలు చేస్తున్నారు. మొన్నామ‌ధ్య యూపీకి చెందిన ఓ మంత్రి గారు,. ఓ పోలింగ్ బూత్‌లో ఓటేశారు. బూత్‌నుంచి బ‌య‌ట‌కు రాగానే మీడియా మిత్రుల‌కు ఫోజిచ్చారు. నేను కూడా ఎన్నిక‌ల‌లో పాల్గొని ఓటేశానంటూ.. ఆయ‌న చిటికెన వేలు చూపించారు. అంతే! అంద‌రూ బిత్త‌ర పోయారు.

ఇక‌, ఈ ప‌రిణామం ఇక్క‌డితో ఆగిపోతే.. బాగుండేది.. తాజాగా తెలంగాణ‌లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల రెండో ద‌శ‌లో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఓటేశారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సొంతూరు ఎల్ల‌ప‌ల్లిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడుకు అల్లోల గౌతమ్ రెడ్డి, సోదరుడు అల్లోల మురళీధర్ రెడ్డి కూడా ఆయనతో వున్నారు. ఓటేసి బైటికొచ్చిన తర్వాత కెమెరాలు వెంటబడ్డంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాసేపు ఆగి.. ఓటేశానంటూ మిడిల్ ఫింగర్ పైకెత్తి ఫోజిచ్చారు. ఈ ఫోటో బైటికొచ్చి వైరల్ కావడంతో.. వాట్ ఈజ్ దిస్ మంత్రిగారు.. అంటూ కామెంట్లు పడిపోతున్నాయి. ‘మిడిల్ ఫింగర్’ చూపడం ఏంటి మంత్రి గారూ అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు మొత్తానికి మంత్రుల శైలే వేర‌ని నిరూపించారు అల్లోల‌. ఇదీ సంగ‌తి!!

మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన టీఆర్ఎస్ మంత్రి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts