డియ‌ర్ కామ్రేడ్‌కు క్రికెట్ దెబ్బ‌..!

May 28, 2019 at 4:18 pm

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ క్రికెట్ ప్ర‌పంచ క‌ప్‌. ఇంగ్లాండ్ వేధిక‌గా ఈనెల 30నుంచి ప్రారంభం కానున్న‌ది. పోటీలు జ‌రిగేది ఇంగ్లాండ్‌లోనే అయినా దాని ప్ర‌భావం టాలీవుడ్‌పై ప‌డింది. ప్ర‌పంచ‌క‌ప్ పుణ్య‌మాని విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా డియ‌ర్ కామ్రేడ్ విడుద‌ల‌పై ప‌డింది. ఈ సినిమాపై ఎక్క‌డో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్ ప్ర‌భావం ఏంట‌నే కదా మీ అనుమానం. ఈ స‌మ‌యంలో సినిమాల క‌న్నా ప్ర‌పంచ క‌ప్‌పైనే దృష్టి పెడ‌తారు జ‌నం.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ ఈనెల‌31న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ఈ స‌మ‌యంలో సినిమాను విడుద‌ల చేస్తే అది అనుకున్న మేర‌కు విజ‌యం సాధించ‌ని ముందుగానే ఊహించిన విజ‌య్ సినిమా విడుద‌ల ను వాయిదా వేసుకున్నాడు. ఈస‌మ‌యంలో సినిమా విడుద‌ల నిర్ణ‌యం స‌రియైన‌ది కాద‌నే భావ‌న‌లో చిత్ర యూనిట్ ఉంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా విడుద‌ల జూలై నెల‌కు వాయిదా వేయ‌డంతో అభిమానుల ఆశ‌ల‌పై నీళ్ళు చ‌ల్లిన‌ట్లైంది. డియ‌ర్ కామ్రేడ్ సినిమా వేస‌వి సెల‌వుల్లో విడుద‌ల చేస్తే మంచి బిజినెస్ అవుతుంద‌ని భావించింది చిత్ర యూనిట్‌. కానీ క‌థ అడ్డం తిరిగింది. ప్ర‌పంచ క‌ప్‌తో జ‌న‌మంతా టీవీల‌కు అతుక్కుపోతారు. ప్ర‌పంచ క‌ప్‌కు తోడు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు భ‌గ‌భ‌గ మండిపోతున్నాయి. దీంతో జ‌నం ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌డుసుకుంటున్నారు. సో అటు ఎండ‌లు, ఇటు ప్ర‌పంచ క‌ప్ నేప‌థ్యంలో డియ‌ర్ కామ్రేడ్ సినిమా జూలైకి వాయిదా ప‌డింది. ఏదైమైనా ఇది విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు ఆశ‌నిపాతంగా మారింది.

డియ‌ర్ కామ్రేడ్‌కు క్రికెట్ దెబ్బ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts