జ‌గ‌న్‌కు ఆఫ‌ర్‌.. బీజేపీ బిగ్ స్కెచ్‌

May 27, 2019 at 2:08 pm

వైసిపి అధినేత జగన్ ఏపీలో ఘన విజయం సాధించాక ఢిల్లీలో వరుస పెట్టి బిజెపికి చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… ఆ పార్టీ కీలక నేత రామ్‌మాధ‌వ్ ల‌తో జగన్ విడివిడిగా భేటీ అవుతూ వస్తున్నారు. ఈ భేటీలో జగన్ ఎన్డీయేలో చేరే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. బిజెపి ఈ ఎన్నికల్లో ఎంత బలం పెంచుకున్నా తర్వాత కూడా జగన్‌ను బీజేపీ ఎందుకు ఎన్డీయేలోకి ఆహ్వానించింది అన్న ప్రశ్నలకు ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. బిజెపి తిరుగులేని భారీ విజయం సాధించింది. బిజెపికి పడిన ఓట్ల సునామీలో దేశవ్యాప్తంగా విపక్షాలు కొట్టుకుపోయాయి. నరేంద్ర మోడీకి మరో ఐదేళ్ళ పాటు తిరుగులేకుండా పోయింది.

ఇదంతా బాగానే ఉన్నా ఎన్డీయేలోకి జగన్ ఆహ్వానించడం వెనక అసలు కథ వేరే ఉంది. పార్లమెంటులో ఎన్డీయే బిల్లులు అన్ని పాస్ అయిపోతుంటాయి. మోడీ, అమిత్ షా ద్వ‌యం మరికొన్ని కీలక నిర్ణయాల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఏ బిల్లు అంటే ఆ బిల్లు తీసుకువచ్చి పార్లమెంటులో పాస్ చేయించి చ‌ట్టం చేసేంత సీన్ మాత్రం బిజెపికి లేదు. పార్లమెంట్‌లో కొన్ని కీలక బిల్లులకు చట్ట సవరణ చేయాలంటే 365 సీట్లు కావాలి. ప్రస్తుతం బీజేపీకి ఉన్న బలం 353.. మరో 12 సీట్లు వద్దన్నా చిన్నచితకా పార్టీలు బిజెపికి మద్దతు ఇస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. లోక్‌స‌భలో ఎలాగోలా బిల్లు పాస్ చేయించి రాజ్యసభకు పంపితే అక్కడ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం తప్పనిసరి. రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే మెజార్టీ 123 రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీకి ఉన్న‌బ‌లం 102 మాత్ర‌మే. అంటే మెజారిటీ సంఖ్య మ‌రో 21 సీట్లు త‌క్కువ‌గా ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి చాలా పార్టీలు మద్దతు ఇస్తాయి. అందులో తెలంగాణలో టిఆర్ఎస్, ఒడిషాలో బిజెడీ వంటి పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి వద్దన్నా రాజ్యసభలో ఆ పార్టీకే ఓటేస్తాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బిజెపి లెక్క వేరేలా ఉంది. సొంత పార్టీ మద్దతుతో విజయం సాధిస్తేనే గొప్పగా ఫీల్ అవుతుంది. బిజెపికి ఈ ఏడాది చివరికు మరో 20 వరకు రాజ్యసభ సీట్లు అదనంగా యాడ్ కానున్నాయి. ఇక ఏపీలో జగన్ ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకొన్నారు. ఈ లెక్కన రాజ్యసభలో జగన్ బలం విలువ కూడా ఎక్కువే. వచ్చే ఐదేళ్ల పాటు ఏపీలో జరిగే ప్రతి రాజ్యసభ సీటులో వైసిపి అభ్యర్థులు పోటీ లేకుండా విజయం సాధిస్తారు. ఈ లెక్కన రాజ్యసభలో బలం కోసం జగన్‌ను అమిత్ షా ఎన్డీయేలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇదే టైమ్‌లో జగన్‌కు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అవసరం తప్పనిసరి. ఈ క్రమంలోనే జగన్ ఎన్డీయేలో చేరితే రెండు మంత్రి పదవులు సైతం అమిత్ షా, రామ్‌మాధ‌వ్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక తనపై ఉన్న కేసుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ స‌హకారం త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ వెర్షన్ మరోలా ఉండనుంది. ప్రత్యేక హోదాపై హామీ ఇస్తేనే ఎన్డీయేలో చేరతానని ముందు నుంచే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వ‌న‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది. మరి 25 ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తాం అని ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు ఎన్డీయేలో చేర‌తాడ‌ని బీజేపీ ఆశించ‌డం ఆ పార్టీ ఊహ‌లే కావొచ్చు. మ‌రి ఫైన‌ల్‌గా జ‌గ‌న్ డెసిష‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

జ‌గ‌న్‌కు ఆఫ‌ర్‌.. బీజేపీ బిగ్ స్కెచ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts