యెల్లో మీడియాకు జగన్ వార్నింగ్ !

May 27, 2019 at 2:36 pm

చేతిలో పేప‌ర్ ఉంది.. జేబులో పెన్నుంది.. అదేమంటే.. ఫోర్త్ ఎస్టేట్ అనే చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ర‌క్ష‌ణ ఛ‌త్రం ఉంది! దీనిని అడ్డు పెట్టుకుని ఏమైనా రాసేయొచ్చు… త‌మ‌కు న‌చ్చ‌నివారిని ఎవ‌రినైనా ఏకేయొచ్చు.. త‌మ‌కు న‌చ్చిన‌, తాము మెచ్చిన టీడీ పీ అధినేత చంద్ర‌బాబు కోసం ఎంత వ‌ర‌కైనా తెగించేయొచ్చు.. అని భావించి ఇప్ప‌టి వ‌ర‌కు క‌ల్పిత క‌థ‌నాలు, చెత్త ప లుకులతో వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించి, విప‌రీత వ్య‌తిరేక ప్ర‌చారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు త‌డిచి పోతోంద నే వార్త‌లు వ‌స్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన స‌మయం నుంచి మ‌రో మాట‌లో చెప్పాలంటే.. జ‌గ‌న్ పార్టీ పెట్టిన సంద‌ర్భం నుంచి ఎల్లో మీడియా క‌త్తిక‌ట్టింది.

ఎల్లో మీడియాగా పేరు తెచ్చుకున్న‌ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ-5లు జ‌గ‌న్‌ను ఎంత‌గా టార్గెట్ చేశాయో చెప్పుకొంటే నెల ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌ట్టేస్తుంది. ఆయ‌న పాద‌యాత్ర‌ను కూడా కించ‌ప‌రిచేలా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ వ‌డాన్ని కూడా వికృతంగా చూపించేలా ఈ ఎల్లో మీడియా స్కెచ్ వేసి మ‌రీ ప్ర‌చారం చేసింది. మ‌రీ ముఖ్యంగా తాజా ఎన్నిక‌ల‌కు ముందు ఈ మీడియా చేసిన యాంటీ ప్ర‌చారం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆంధ్ర‌జ్యోతిలో నిత్యం జ‌గ‌న్కు వ్య‌తిరేకం గా పేజీల‌కు పేజీలు వార్త‌లు వండి వార్చారు. ప్ర‌త్యేకంగా బులెటిన్లు ప్ర‌సారం చేశారు. ఇలా చేసి అయినా..చంద్ర‌బాబును గెలిపించుకునేందుకు జ్యోతి అధినేత ఎంతో ప్ర‌య‌త్నించారు.

అయితే, ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. అయినా కూడా జ‌గ‌న్ విజ‌యాన్ని ఈ ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతోంది. ప్ర‌తి విష‌యంలోనూ పుల్ల‌లు పెట్టేందుకు, బాబు క‌న్నా జ‌గ‌న్ వేస్ట్ అని చూపించేందుకు ఆయ‌న ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే ప‌నులు ప్రారంభించేసింది. అయ‌తే, దీనిని ఇప్ప‌టికే గుర్తించిన జ‌గ‌న్‌.. నైస్గా ఈ ఎల్లో మీడియాను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా మీడియా ముఖంగా వెల్ల‌డించారు. మీడియాపై నేరుగా ఎలాంటి చ‌ర్యలు తీసుకోకుండా.. అవి రాసే త‌ప్పుడు రాత‌ల‌ను వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను చ‌ట్టం రీత్యానే ఎదుర్కొనేందుకు సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

దేశంలోనే తొలిసారిగా పరిపాలన కోసం జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుచేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాయ‌ని, ఏది ఏమైనా ఇవి చంద్రబాబుతోనే ఉంటాయ‌ని చెప్పారు. అందుకే ఈ వ్యవస్థను మార్చబోతున్నామ‌న్నారు. సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామ‌ని చెప్పారు. “మేం ఏం చేయాలనుకున్నా ముందుగా ఆ ప్రతిపాదనను కమిషన్ ముందు ఉంచుతాం. వాళ్లు చెప్పే సూచనలు పాటిస్తాం, పాలసీలో మార్పులు చేస్తాం. అలా జ్యూడీషియల్ కమిషన్ అనుమతితోనే ఏ పాలసీనైనా తీసుకొస్తాం. అలాంటి పాలసీలపై ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి సంస్థలు ఏవైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అప్పుడు వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటాం“ అని జ‌గ‌న్ చెప్పారు. అంటే దీనిని బ‌ట్టి నేరుగా జ‌గ‌న్ పాల‌న‌లో వేలు పెట్టి.. ఏదిప‌డితే రాసి.. ఆయ‌న ప్ర‌తిష్ట‌కు, ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తే.. తాట తీస్తాన‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు జ‌గ‌న్‌. మ‌రి ఇప్ప‌టికైనా ప‌చ్చ మీడియా మారుతుందా లేదా చూడాలి.

యెల్లో మీడియాకు జగన్ వార్నింగ్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts