మార్మోగిన జగన్ నినాదం.. వైసీపీదే అధికారం

May 23, 2019 at 1:03 pm

నినాదం.. అత్యంత వేగంగా .. అత్యంత చురుగ్గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌లిగేది ఇదే. ఈ నినాదాల చుట్టూతానే రాజ‌కీయ పార్టీలు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటాయి. థ్యాంక్యూ సీఎం సార్! అనే నినాదంతో తాను చేసిన సంక్షేమాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు విజ‌యం సాధించారు. అదేస‌మ‌యంలో 2014లో కూడా ఆయ‌న ఆయ‌నే రావాలి- బాబు వ‌స్తేనే జాబ్ వ‌స్తుంది. అనే నినాదాల‌ను జోరెత్తించారు. ఫ‌లితంగా ఇది సామాన్యుల్లోకి కూడా వెళ్లింది. అత్యంత చిన్న చిన్న స్లోగ‌న్లు.. ప్ర‌జ‌ల నాలుక‌ల‌పై తచ్చాడాయి. అదేవిధంగా ఈ ఎన్నిక‌ల్లోనూ రెండు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య పోరు హోరెత్తినా.. నినాదాలు కూడా అదే రేంజ్లో కొన‌సాగాయి.

టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఏపీఅ నే ప‌దానికి అమ‌రావ‌తి, పోల‌వ‌రం అనే నినాదాల‌ను టీడీపీ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లింది. అదేవిధంగా మ‌రోసారి అధికారంలోకి బాబు వ‌స్తేనే అభివృద్ధి అనే నినాదాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెల్లింది. అయితే, ఈ రెండు కూడా పెద్ద‌గా స‌క్సెస్ అయిన‌ట్టు ఎక్క‌డా మ‌న‌కు తాజా ఫ‌లితాల్లో క‌నిపించ‌డం లేదు. అదేస‌మ యంలో వైసీపీ తీసుకున్న నినాదం.. రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ నినాదం సామాన్యుల్లోకి జోరుగా వెళ్లింది. ప‌లితం ఇప్పు డు క‌నిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీని క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేసిందా? అనే ప్ర‌చారం కూడా జోరందుకుంది.

అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం గురించి కానీ, అమ‌రావ‌తి నిర్మాణం గురించి కానీ జ‌గ‌న్ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. పైగా త‌న మేనిఫెస్టోలో వీటికి చోటు కూడా క‌ల్పించ‌లేదు. కేవ‌లం మార్పు.. అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకువెళ్లారు. అదేస‌మ‌యంలో ఒక్క చాన్స్‌-అనే నినాదాన్ని జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లారు. ఈ మూడు నినాదాలు రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్‌, మార్పు, ఒక్క‌ఛాన్స్ వంటివి రాష్ట్రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు పని చేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో అధికార టీడీపీ ఎన్ని నినాదాలు చేసినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదని, పైగా చంద్ర‌బాబు వంగి వంగి దండాలు పెట్టినా ఫ‌లించ‌లేద‌ని అంటున్నారు.

మార్మోగిన జగన్ నినాదం.. వైసీపీదే అధికారం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts