పుల‌కించిన ఇడుపులపాయ‌.. రీజ‌న్ ఇదే

May 23, 2019 at 1:23 pm

ఇడుపులపాయ‌. క‌డ‌ప జిల్లాలోని వైఎస్ స‌మాధి ఉన్న ప్రాంతం! అయితే, ఇప్పుడు అక్క‌డ సంబ‌రాలు మిన్నంటాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏ కార్య‌క్ర‌మం చేసినా ఇక్క‌డ నుంచే ప్రారంభించేవారు. నిజానికి 2009లో వైఎస్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత‌, ఆయ‌న భౌతిక దేహాన్ని ఇక్క‌డే స‌మాధి చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఈ ప్రాంతం వైసీపీకి దేవాల‌యంగా మారిపోయింది. వైసీపీ త‌ర‌ఫునే కాకుండా అభ్య‌ర్థులు కూడా ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్నా.. ఈ ప్రాంతాన్ని సెంటిమెంటుగా భావించారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించింది కూడా ఇక్క‌డ నుంచే కావ‌డం విశేషం. ఇక‌, వైసీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌టన కూడా ఇడుపాయ‌ల స‌మాధి వ‌ద్ద ప్రార్థ‌న‌లు చేసిన త‌ర్వాతే టికెట్ల కేటాయింపు ప్రారంభించా రు. మొత్తంగా చూసుకుంటే.. ఇడుపుల పాయ‌తో జ‌గ‌న్‌ది అత్యంత ద‌గ్గ‌ర సంబంధం. అసెంబ్లీ స‌మావేశాల‌కు తొలిసారి హాజ‌రైన‌ప్పుడు కూడా జ‌గ‌న్ ఇక్క‌డ‌కు వ‌చ్చే ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్ ఈ ప్రాంతాన్ని దేవాల‌యంగా మార్చుకుని ముందుకు వ‌చ్చారు. ఇదే ఇప్పుడు ఆయ‌న‌ను ఆశీర్వ‌దించింద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

ప్ర‌స్తుత ఫ‌లితాల ట్రెండ్‌లో వైసీపీ దూకుడు భారీ రేంజ్‌లో సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ అభ్య‌ర్థులు ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఇలాంటి ఫ‌లితాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని అంటున్నారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. ఏదేమైనా.. ఈ స‌మ‌యంలో వైఎస్ దీవెన‌తోపాటు.. జ‌గ‌న్ కృషి, అలుపెరుగ‌ని పాద‌యాత్ర వంటివి పూర్తిగా ఉన్నాయ‌ని చెబుతున్నారు వైసీపీ ప‌రిశీల‌కులు. వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ వేసిన అడుగులు ఫ‌లితాన్ని ఇచ్చాయి. మొత్తంగా ఆశించిన దానిక‌న్నా కూడా భారీ మెజారిటీ వ‌స్తున్న నేప‌థ్యంలో ఇడుపులపాయ వ‌ద్ద సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి.

పుల‌కించిన ఇడుపులపాయ‌.. రీజ‌న్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts