అదే నిజమైతే జగన్ నిర్ణయం భేష్ !

May 7, 2019 at 2:35 pm

త్వ‌ర‌లోనే ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేస‌కునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ఆపార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని జోరుగా ప్ర‌చారం జరుగుతోంది. మే 23న ఫ‌లితాలు వెలువ‌డిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప‌లువురు ఆ పార్టీకి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఇక ఆపార్టీలో చేర‌డం వ‌ల్ల త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఢోకా ఉండ‌ద‌ని నేత‌లు భావిస్తున్నుట్లు స‌మాచారం. అయితే ఎవ‌రెవ‌రు పార్టీ మారుతార‌నే అంశం ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తేల‌నుంది.

ప్ర‌జల తీర్పు ఏవీఎంల్ల‌లో నిక్షిప్త‌మై ఉంది. అయితే ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ ఓట‌మిని ముందే అంగీక‌రించ‌నట్లుగా పేర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిస్థితుల్లో ప‌లువురు కీల‌క నేత‌లు టీడీపీని వీడే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ సీనియ‌ర్ నేత‌లు, ప‌లువురు మంత్రులు కూడా వైసీపీ అధిష్టానంతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు ప్ర చారం జ‌రుగుతోంది. తాము తెలుగుదేశం పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని ఇప్ప‌టికే సంకేతాలు పంపిన‌ట్లు స‌మాచారం.

అయితే తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను చేర్చుకునే అంశంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుముఖంగా లేర‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ నుంచి గెలిచిన ప‌లువురు టీడీపీలో చేర‌గా, తాము అన‌ర్హ‌త వేటు కోసం పోరాడామ‌ని, తిరిగి అదే ప‌ని చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయితామ‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్లు ఆయ‌న స‌న్నిహితులు పేర్కొంటున్నారు. పార్టీ ఫిరాయింపుల‌కు తాము వ్య‌తిరేకమ‌ని, జంప్ జిలానీల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ లో చేర్చుకునేది లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే పేరున్న ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు ప‌ట్ట‌బ‌డితే మాత్రం వారితో ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించి, తిరిగి ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని ఆయ‌న యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో కూడా పార్టీ ప‌ట్ల విశ్వ‌స‌నీయ పెరుగుతంద‌ని జ‌గన్ మోహ‌న్ రెడ్డి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అదే నిజమైతే జగన్ నిర్ణయం భేష్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts