ఈ స‌మ‌యంలో.. ఇలా చేస్తే బెట‌రేమో జ‌గ‌న్‌!

May 4, 2019 at 11:28 am

ఏపీలో ఎప్పుడు తుఫానులు వ‌స్తాయో, ఎప్పుడు ఎలాంటి ప్ర‌కృతి విప‌త్తులు సంభవిస్తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. మ‌రి అలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఆస‌రాగా క‌నిపించేది నాయ‌కులే. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు త‌మ‌కు ఏం చేసినా.. చేయ‌క పోయినా..ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టిన స‌మ‌యంలో మాత్రం త‌మ‌ను ఆదుకునే నాయ‌కుడు కోసం వారు ఎదురు చూస్తార‌న‌డంలో సందేహం లేదు. రాష్ట్రానికి ప్ర‌తి సంవ‌త్సరం ఏదో ఒక రూపంలో ఆప‌ద సంభ‌విస్తూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో ఆయా బాధితులు ప్ర‌భుత్వాలు లేదా తాము ఓట్లేసి గెలిపించిన నాయ‌కుల‌పై ఆధార‌ప‌డ‌తారు. ముఖ్యంగా తుఫాన్ వంటివి సంభ‌వించి స‌ర్వ‌స్వం కోల్పోయిన సంద‌ర్భంలో ఈ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంటుంది.

తాజా విష‌యానికి వ‌స్తే.. హిందూమ‌హాస‌ముద్రంలో పుట్టిన ఫ‌ణి తుఫాన్ ప్ర‌భావంతో ఒడిసా అల్ల‌క‌ల్లోల మైంది. మ‌న‌కు కూడా ముప్పు ఉంటుంద‌ని, భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. తుఫాను దిశ‌ను మార్చుకుని మ‌న రాష్ట్రం మీద‌కు రాకుండా పోయింది అయితే, తుఫాను ప్ర‌భావం మాత్రం శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం జిల్లాల‌పై భారీగా క‌నిపిం చింది. గంట‌కు 130 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలుల‌కు భారీ సంఖ్య‌లో కొబ్బ‌రి చెట్లు, తోట‌లు కూడా విరిగిపోయాయి. ఇక, కుండ పోత వ‌ర్షాలు న‌ష్టం చేకూర్చాయి. ఈ నేప‌థ్యంలో ఆరు నుంచి 10 మండ‌లాల వ‌ర‌కు కూడా న‌ష్ట‌పోయాయి. ఇక్క‌డ బాధితులు ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూస్తున్న ప‌రిస్థితి క‌నిపించింది.

మ‌రి ఈ క్ర‌మంలో అక్క‌డి బాధితులు త‌మ‌ను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌డంతో అధికార పార్టీ నాయ‌కుడు, సీఎం చంద్ర‌బాబు ఏమీ చేసేందుకు అవ‌కాశం లేకుండా పోయిం ది. దీంతో ఆయ‌న నాలుగు జిల్లాల‌లో కోడ్‌ను తొల‌గించాల‌ని ఈసీకి లేఖ రాశారు. దీనికి త‌గిన విధంగా ఆదేశాలు వ‌చ్చా యి. దీంతో ఆయ‌న స‌మీక్ష‌లు, స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌ఘువీరా కూడా కోడ్‌ను తొల‌గించాల‌ని ఈసీకి లేఖ రాశారు. త్వ‌ర‌లోనే బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి కొంత మేర‌కు సాయం చేయాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రి ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, త్వ‌ర‌లోనే తెలియ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తామే గెలవ‌బోతున్నామ‌ని చెబు తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా తుఫాను బాధితులకు అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌జాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. అయితే, తుఫాన్ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. లండ‌న్ వెళ్లి త‌న కుమార్తెను చూడాల‌నుకున్న జ‌గ‌న్‌.. దీనిని నాలుగు రోజుల‌కు వాయిదా వేసుకున్నారు. అయితే, ఇలా వాయిదా వేసుకుని హైద‌రాబాద్‌కే ప‌రిమితం కాకుండా నేరుగా రంగంలోకి దిగి.. బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌ని, త‌న పార్టీ శ్రేణుల‌ను కూడా రంగంలోకి దింపాల‌ని ప్ర‌జాస్వామ్య వాదులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం అధికారం లేక పోయినా.. విప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న త‌న శ‌క్తిని వినియోగించి సాయం చేయొచ్చ‌ని సూచిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తాడో చూడాలి.

ఈ స‌మ‌యంలో.. ఇలా చేస్తే బెట‌రేమో జ‌గ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts