చింతమనేనిపై వైసీపీ మెజారిటీ లెక్క చెప్పేసిన అబ్బయ్య చౌదరి

May 17, 2019 at 4:52 pm

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఎన్నిక‌ల వేడి మాత్రం చ‌ల్లార‌లేదు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో వారం రోజులు స‌మ‌యం ఉండడంతో ఎక్క‌డిక‌క్క‌డ అంచ‌నాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్ర‌జ‌లు మార్పు కోరుకోవ‌డంతో ఆ ప్ర‌భావం వైసీపీపై ఉంటుంద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. దీంతో వైసీపీ నుంచి పోటీ చేసిన నేత‌లు ఫ‌లితాల స‌ర‌ళిని అంచ‌నా వేసుకుని త‌మ గెలుపుపై లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం, నిత్యం వార్త‌ల్లో ఉండే సెగ్మెంట్ దెందులూరుపై కూడా వైసీపీ నాయ‌కులు త‌మ అంచ‌నాల్లో తాము ఉన్నారు.

ఇక్క‌డ నుంచి టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ‌రుస విజ‌యాలు సాధించారు. ఇప్పుడు కూడా ఆయ‌న గెలిస్తే.. హ్యాట్రిక్ కొట్టిన‌ట్టే అవుతుంది. కానీ, ఆయ‌న దూకుడు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, చేష్ఠ‌ల కార‌ణంగా ఇక్క‌డ ప్ర‌జ‌లు మార్పు కోరుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నుంచి ఇక్క‌డ బ‌రిలో నిలిచిన విద్యావేత్త‌, ఎన్నారై యువ నేత కొఠారు అబ్బ‌య్య చౌద‌రి. `తెలుగు జ‌ర్న‌లిస్ట్‌` తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన అబ్బ‌య్య చౌద‌రి త‌న గెలుపుపై పూర్తి ధీమా వ్య‌క్తం చేశారు. అంతేకాదు, పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన త‌న‌కు ఎంత మెజారిటీ వ‌స్తుందో కూడా లెక్క‌లు వేసి మ‌రీ చెప్పారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని, ఈ విష‌యంగా స్ప‌ష్టంగా తెలిసింద‌ని ఆయ‌న తెలిపారు. మొత్తానికి ఇక్క‌డ గెలుపు త‌న‌దేన‌ని అన్న కొఠారు వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే..

“రాష్ట్రంలోనే కాకుండా నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతి పాల‌న‌ను అంత మొందించాల‌ని ప్ర‌జ‌లు ఎలాగైతే కంక‌ణం క‌ట్టుకుని ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటారో.. అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గంలోనూ అరాచ‌క పాల‌నను అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న‌ట్టు నేను గ‌మ‌నించాను. మూడు నాలుగు వేల మెజారిటీతో ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతాను. పెదివేగి మండ‌లం స‌హా పెద‌పాడు, దెందులూరు, ఏలూరు రూర‌ల్‌ మండ‌లాల్లో త‌న‌కు మెజారిటీ రావ‌డం ఖాయం. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు“ అన్నారు.

అంతేకాదు, “చ‌దువుకున్న వ్య‌క్తికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ కోసం ఎలా అయితే త‌పిస్తున్నారో.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. బీసీల్లో క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. అదేవిధంగా మ‌హిళ‌లు కూడా సాలిడ్‌గా పార్టీకి అండగా నిలిచారు. కాపుల ఓట్లు కూడా చాలా వ‌ర‌కు వైసీపీకే ప‌డ్డాయ‌ని తెలుస్తోంది“ – అని త‌న విజ‌య ర‌హ‌స్యాన్ని వివ‌రించారు. ఇక ఎస్సీలు, ఎస్టీలు, వ‌డ్డీలు, యాద‌వ, గౌడ ఇత‌ర బీసీ కులాల ప్ర‌జ‌లంద‌రూ త‌న‌కు పూర్తిగా అండ‌గా నిలిచార‌న్న ఆయ‌న ఓసీ ఓట్ల‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్య‌తిరేక‌త‌తో చాలా వర‌కు చీలి… వారంతా వైసీపీకి అండ‌గా నిలిచార‌ని ఆయ‌న తెలిపారు.

ఇక త‌న‌కు క‌నిష్టంగా 4-6 వేల ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌న్న ఆయ‌న గ‌రిష్టంగా 10-12 వేల మెజార్టీ త‌గ్గ‌ద‌ని.. పార్టీ వేవ్ అంచ‌నాల‌కు మించిపోతే ఇది ఇంకా ఎక్కువే ఉంటుంద‌న్నారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి ఏపీలో మార్పు ఎలా కోరుకుంటున్నారో ? దెందులూరు కూడా మార్పు రావాల‌ని కోరుకునే వారు రాష్ట్రంలో కూడా అలాగే ఉన్నారు. మ‌రి అబ్బ‌య్య ఇక్క‌డ ఎలాంటి మ్యాజిక్ చేశారో ? చూడాలి.

చింతమనేనిపై వైసీపీ మెజారిటీ లెక్క చెప్పేసిన అబ్బయ్య చౌదరి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts