వైసీపీలో ఎగ్జిట్ జోష్‌: ఆర్థికం-విజ‌య‌సాయి… కాబోయే మంత్రుల జాబితా ఇదే !

May 21, 2019 at 11:39 am

ఏపీలో అధికార మార్పిడి జ‌ర‌గ‌నుంది… వైఎస్‌.జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని నేష‌న‌ల్ మీడియాతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియా సంస్థ‌లు కూడా చెపుతున్నాయి. జ‌గ‌న్ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వైసీపీ నేత‌లు కూడా గెలిచేది తామే అన్న ధీమాతో ఉన్నారు. ఇదే క్ర‌మంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య స‌రికొత్త చ‌ర్చ కూడా న‌డుస్తోంది. జ‌గ‌న్ కేబినెట్లో ఎవ‌రెవ‌రికి ? స‌్థానం ల‌భిస్తుంద‌న్న దానిపై ఎవ‌రికి వారు ఆశ‌ల ప‌ల్ల‌కీల్లో ఊరేగుతున్నారు.

జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి కీలకమైన శాఖలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త కేబినెట్లో ఆర్థిక మంత్రి ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర వార్త‌లే వైసీపీ వ‌ర్గాల్లో ట్రెండ్ అవుతున్నాయి. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ముందుగా ఈ పోస్టు కోసం మాజీ ఆర్థికమంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి (ప్ర‌స్తుత వెంక‌ట‌గిరి వైసీపీ క్యాండెట్‌) పేరు ప‌రిశీల‌న‌లో ఉన్నా ఆయ‌న ప‌లు పార్టీలు మారి వైసీపీలోకి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే ఆనం కంటే జ‌గ‌న్ విజ‌య‌సాయి వైపే మొగ్గు చూప‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌ విజయసాయిని కూడా ఎమ్మెల్సీని చేసి ఆర్థిక శాఖను అప్పగిస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది. చంద్ర‌బాబు కూడా త‌న కేబినెట్‌లో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడును ఎమ్మెల్సీని చేసి ఆర్థిక‌శాఖ అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక‌రంగంలో అపార అనుభ‌వం ఉన్న విజ‌య‌సాయినే ఎమ్మెల్సీని చేసి ఆర్థిక‌మంత్రి అప్ప‌గిస్తున్న‌ట్టు టాక్‌. ఇక కీల‌క‌మైన స్పీక‌ర్ ప‌ద‌విని ప‌రుచూరు బ‌రిలో ఉన్న ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఇస్తార‌ని అంటున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న కుద‌ర‌క‌పోతే (ఓట‌మి, ఇత‌ర కార‌ణాలు) స‌త్తెన‌ప‌ల్లిలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుపై పోటీ చేసిన అంబ‌టి రాంబాబుకు ఈ ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. స్పీక‌ర్‌గా వీరిద్ద‌రిలో ఎవ‌రు ఉన్నా వీరు త‌మ బ‌ల‌మైన వాయిస్‌తో టీడీపీని నిలువ‌రిస్తార‌ని అంటున్నారు. ఇక వీరితో పాటు జ‌గ‌న్‌తో ప్రారంభం నుంచి ప్ర‌యాణం చేసిన ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు.

వైసీపీలో ఎగ్జిట్ జోష్‌: ఆర్థికం-విజ‌య‌సాయి… కాబోయే మంత్రుల జాబితా ఇదే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts