వైసీపీ మంత్రులు వీళ్లే..ప్రకటన త్వరలో !

May 24, 2019 at 6:10 pm

ఏపీలో బంఫర్ మెజార్టీతో గెలిచిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 30న విజ‌య‌వాడ‌లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న‌తో పాటు ఆయ‌న కేబినెట్‌లో ఎవ‌రెవ‌రు ? మ‌ంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు అన్న‌ది స‌హ‌జంగానే ఆస‌క్తిగా ఉంది. వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో మంత్రి ప‌ద‌వుల కోసం పోటీప‌డే ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంది. చాలా మంది సీనియ‌ర్లు, జూనియ‌ర్లు మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.

జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు 16 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరు త‌మ ఎమ్మెల్యే, మంత్రి ప‌ద‌వులు వ‌దులుకుని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ విజ‌యం సాధించారు. వీరిలో కొంద‌రు గ‌త ఎన్నిక‌ల్లో గెలిస్తే… ఇప్పుడు వ‌రుస‌గా మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు. ఇలా వైసీపీ నుంచే మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. వీరంతా స‌హ‌జంగానే మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.

ఈ లెక్క ఓ 40కు పైగానే ఉంది. కానీ కేబినెట్‌లో సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. జ‌గ‌న్‌కు ఇప్పుడు గెలుపు కాదు కాని కేబినెట్ కూర్పు పెద్ద స‌వాల్‌గా మారింది. క్యాస్ట్ ఈక్వేష‌న్లు, జిల్లా ఈక్వేష‌న్లు, ఏరియా వైజ్ ఈక్వేష‌న్లు ఇలా చాలా చూసుకోవాలి. రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలతో పాటు ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి ప్ర‌తి జిల్లాలోనూ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన మినిస్ట‌ర్లు ఉండ‌నున్నారు.

జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వుల‌పై హామీలు ఇచ్చారు. వీరిలో మంగ‌ళ‌గిరిలో గెలిచిన ఆర్కే, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇక మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న వారి వివ‌రాలు చూస్తే జిల్లాల వారీ లిస్ట్ ఇలా ఉంది..

ప్రకాశం జిల్లా:
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం)

కృష్ణా జిల్లా:
పేర్ని నాని (మచిలీపట్నం)
ఉదయభాను (జగ్గయ్యపేట)
కొడాలి నాని (గుడివాడ‌)
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు)
కొలుసు పార్థ‌సార‌థి (పెన‌మ‌లూరు)

గుంటూరు జిల్లా:
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి)
మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ కోటా)
అంబటి రాంబాబు (సత్తెనపల్లి)
కోన రఘుపతి (బాపట్ల)

అనంతపురం జిల్లా:
అనంత వెంకట్రామిరెడ్డి (అనంతపురం)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)

చిత్తూరు జిల్లా:
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
కరుణాకర్ రెడ్డి (తిరుపతి)
రోజా (నగరి)

కర్నూలు జిల్లా:
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్)
శ్రీదేవి (పత్తికొండ)
హఫీజ్‌ఖాన్ (కర్నూలు)

కడప జిల్లా:
శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి)
అంజాద్ భాషా (కడప)

శ్రీకాకుళం జిల్లా:
ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)
ధ‌ర్మాన కృష్ణ‌దాస్ (న‌ర‌స‌న్న‌పేట‌)
కళావతి (పాలకొండ)
రెడ్డి శాంతి (పాతపట్నం)

విజయనగరం జిల్లా:
బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
పుష్ప శ్రీవాణి (కురుపాం)
రాజన్నదొర (సాలూరు)

విశాఖ జిల్లా:
గుడివాడ అమరనాథ్ (అనకాపల్లి)
గొర్లె బాబూరావు (పాయకరావుపేట)
ముత్యాలనాయుడు (మాడుగుల)
అవంతి శ్రీనివాస్ (భీమిలి)

తూర్పుగోదావరి జిల్లా:
సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ కోటా)
కన్నబాబు (కాకినాడ రూరల్)
దాడిశెట్టి రాజా (తుని)

పశ్చిమగోదావరి జిల్లా:
ఆళ్ల నాని (ఏలూరు)
తెల్లం బాలరాజు (పోలవరం)
తానేటి వనిత (కొవ్వూరు)
గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)

నెల్లూరు జిల్లా:
మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు)
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి (కావలి)
ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి)

వైసీపీ మంత్రులు వీళ్లే..ప్రకటన త్వరలో !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts