పోస్ట‌ల్ బ్యాలెట్‌లో వైసీపీ దూకుడు..

May 23, 2019 at 8:51 am

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్‌సభ స్థానాలకు లెక్కింపు జ‌రుగుతోంది. 13 జిల్లాల్లో 36 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం లెక్కింపు ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేప‌డుతోంది. అయితే.. గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌, సర్వీస్‌ ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 5 వేల 40 పోస్టల్‌ బ్యాలెట్లను, 60 వేల 250 సర్వీస్‌ ఓట్లను ఈసీ జారీ చేసింది. అయితే.. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో వైసీపీ పూర్తి ఆధిక్యంతో ముందుకు వెళ్తోంది.

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో ఆధిక్యంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానంగా… తూర్పు గోదావారి జిల్లా పి.గన్నవరం, శ్రీకాకుళం జిల్లా రాజాం, కడప అసెంబ్లీ స్థానం, కమలాపురం, అరకు, పాలకొండ, నెల్లూరు సిటీ, పాత‌ప‌ట్నం అమలాపురంరం, పలాస, టెక్కలి, సత్తుపల్లి, చీపురుపల్లి, సత్తెనపల్లి స్థానాల్లో బ్యాలెట్‌ కౌంటింగ్‌లో వైసీసీ ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండింగ్ ఈవీఎంల లెక్కింపులోనూ క‌న‌బ‌డుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

నిజానికి.. పోలింగ్ జ‌రిగిన రోజునే ఏపీలో వైసీపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని దాదాపుగా అన్ని సంస్థ‌ల స‌ర్వేలు చెప్పాయి. ఇప్పుడు పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు ట్రెండింగ్ చూస్తే మాత్రం ఆ స‌ర్వేల ఫ‌లితాలు నిజం కాబోతున్నాయ‌న్న అంచ‌నాకు వైసీపీ శ్రేణులు వ‌స్తున్నాయి. అటు పార్ల‌మెంట్ స్థానాలు, ఇటు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్య‌త క‌న‌బ‌ర్చ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నాయి. ఈ ట్రెండింగ్‌తో ఏపీ ఉద్యోగులంద‌రూ కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో వైసీపీ దూకుడు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts