టాలీవుడ్లోనే ఖరీదైన అల్లు అర్జున్ కార్వాన్.. రేటెంతో తెలుసా!

June 18, 2019 at 5:38 pm

విలాస‌వంత‌మైన ర‌వాణాతో పాటు విలాస‌వంత‌మైన సౌక‌ర్యాల‌తో కూడిన‌ కార‌వ్యాన్ ను త‌యారు చేయించుకుంటున్నారు స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌. విలాస‌వంత‌మైన కార్వాన్ల‌ను బాలీవుడ్ హీరోలు త‌యారు చేయించుకుని త‌మ సినిమా షూటింగ్‌ల‌కు తీసుకెళుతుంటారు. అయితే బాలీవుడ్ హీరోల‌కు తీసిపోకుండా మ‌న టాలీవుడ్ హీరోలు కూడా ఈ కార్వాన్ల‌పై మోజు పెంచుకుంటూ కోట్ల రూపాయ‌లు వెచ్చించి త‌మ‌కు అనుకూలంగా త‌యారు చేయించుకుంటున్నారు.

ఇప్ప‌టికే కార్వాన్లు క‌లిగి ఉన్న‌వారిలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరు ఎప్పుడో కార్వాన్ల‌ను త‌యారు చేయించుకున్నారు. ఇప్పుడు వీరి స‌ర‌స‌న స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ చేరారు. అల్లు అర్జున్ త‌న ఇమేజ్‌కు త‌గ్గ‌కుండా ఏఏ బ్రాండ్‌తో కార్వాన్ను త‌యారు చేయించుకున్నారు. స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన కొత్త కార్వాన్ను అక్ష‌రాల రూ.7కోట్ల వ్య‌యంతో త‌యారు చేయించుకున్న‌ట్లు చిత్ర‌సీమ‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ఏఏ 19 అనే వ‌ర్కింగ్ పేరుతో సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఏఏ బ్రాంబ్ నేమ్ అంటే అల్లు అర్జున్‌. ఈ కార్వాన్ ముంబైలోని ఓ ఇంటీరియ‌ర్ వ్యానిటీ వ్యాన్ డిజైనింగ్ స్పెష‌లిష్టు వ‌ద్ద డిజైన్ చేయించార‌ట‌. ఏ టూ జెడ్ బ్లాక్ అండ్ బ్లాక్ గ్లాసెస్‌లో ఏఏ బ్రాండ్ డిజైన్‌తో కార్వాన్ లుక్ అదిరిపోతుంది. ఈ కార్వాన్ చిత్రాల‌ను విడుద‌ల చేయ‌డంతో అవి విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కార్వాన్కు రూ.3.5కోట్లు, డిజైన్‌కు రూ.3.5కోట్ల‌తో మొత్తం రూ.7కోట్ల వ్య‌యంతో త‌యారు చేయించార‌ట‌.

టాలీవుడ్లోనే ఖరీదైన అల్లు అర్జున్ కార్వాన్.. రేటెంతో తెలుసా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts