అసెంబ్లీ తొలి భేటీలో టీడీపీ వ్యూహం..!

June 11, 2019 at 4:36 pm

రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డి వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌దిరోజుల్లోనే అసెంబ్లీ స‌మావేశాల‌కు రెడీ అయింది. బుధ‌వారం నుంచి ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటు 151 మందితో అధికార వైసీపీ కేవ లం 23 మందితో టీడీపీ అసెంబ్లీ భేటీల్లో పాల్గొన‌నున్నాయి. ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాల్లో తొలి రెండు రోజులు కూడా కొత్త సభ్యుల ప‌రిచ‌య కార్య‌క్ర‌మం, ప్ర‌మాణ స్వీకారం, స్పీక‌ర్ ఎన్నిక‌, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌, వారితో ప్ర మాణ స్వీకారం. అనంత‌రం విందు కార్య‌క్ర‌మాలతో స‌భా స‌మ‌యం స‌ర‌దాగా గ‌డిచిపోతుంది. అయితే, కొత్త సీఎంగా ప్ర‌మా ణం చేసిన జ‌గ‌న్‌.. గ‌త సీఎం చంద్ర‌బాబు మాదిరిగా తాను ఏం చేసినా ప్ర‌చారం చేసుకోన‌ప్ప‌టికీ.. స‌మ‌య పాల‌న‌ను మా త్రం ఖ‌చ్చితంగా పాటిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే నిన్న‌టికి నిన్న జ‌రిగిన తొలి కేబినెట్‌లోనే ఆయ‌న ఐదు ప‌ది నిముషాలు ఆల‌స్యంగా వ‌చ్చిన మంత్రుల‌కు క్లాస్ పీకార‌ని వార్త‌లు వ‌చ్చాయి.ఈ నేప‌థ్యంలో అసెంబ్లీని ఐదు రోజులు గ‌డ‌పాల‌ని అనుకున్న‌ప్పుడు ఖ‌చ్చితంగా తొలి రెండు రోజులు ప్ర‌మాణాల‌కోసం కేటాయించినా.. మిగిలిన మూడు రోజులు మాత్రం సీరియస్‌గానే నిర్వ‌హించాల‌ని నిర్ణ యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. త‌న తొలి కేబినెట్‌లో చేసుకున్న నిర్ణ‌యాల‌ను స‌భ ముందు ఉంచ నున్నారు. అయితే, ఇదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఏం చేస్తుంద‌నే విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ కు వ‌స్తోంది. మొత్తం 23 మందిలో ప‌ట్టుమ‌ని ప‌ది మంది మాత్ర‌మే సీనియ‌ర్లు ఉన్నారు. మిగిలిన 13 మంది కూడా జూనియ‌ర్లే.

దీంతో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? లేక సూచ‌న‌లు స‌ల‌హాల వ‌ర‌కే ప‌రిమిత మ‌వుతుందా? అనేది ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్ట్‌గా మారింది. తొలుత టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన తీర్మానం మేర‌కు తొలి ఆరు మాసాల వ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇవ్వాల‌ని, త‌ర్వాతే స్పందించాల‌ని అనుకున్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తారా? లేక ఎలాగూ అసెంబ్లీకి వ‌చ్చాం కాబ‌ట్టి మ‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకుంటారా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఒక వేళ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తే.. అటు నుంచి వైసీపీ గ‌ట్టిగానే స‌మాధానం చెప్పేందుకు రెడీ అవు తుంద‌న్న విష‌యంలో సందేహం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

అసెంబ్లీ తొలి భేటీలో టీడీపీ వ్యూహం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts