బాల‌య్యతో సైఅంటున్న టాప్ హీరోయిన్

June 18, 2019 at 5:12 pm

బాల‌య్య సిని ఇండ‌స్ట్రీలో మోస్ట్ సీనియ‌ర్ హీరోల‌లో ఒక‌రు. బాల‌య్య కు జోడిగా హీరోయిన్ల‌ను ఎంపిక చేయ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌ల‌కుమించిన భారంగా మారుతున్న‌ది. బాల‌య్య సినిమా అన‌గానే హీరోయిన్ ఎవ‌రు అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దీంతో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నో తెలియ‌క ద‌ర్శ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. బాల‌య్య‌కు స‌రిజోడి హీరోయిన్లు దొరికారంటే సినిమా పూర్త‌యిన‌ట్లేన‌ని చిత్ర‌యూనిట్ అభిప్రాయం.

ఇక బాల‌య్యతో కొత్త‌గా ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. బాల‌య్య‌తో కె.ఎస్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఓ సీనియ‌ర్ న‌టీమ‌ణి న‌టిస్తుంద‌ట‌. బాల‌య్య ప‌క్క‌న ఈ హీరోయిన్ ఇప్ప‌టికే మూడు సినిమాల్లో న‌టించింది. ఆమేను నాలుగోసారి బాల‌య్య ప‌క్క‌న న‌టించేందుకు ఒప్పించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే బాల‌య్య‌తో క‌లిసిన న‌టించిన ఆ భామ ఎవ‌రో కాదు శ్రియ‌క‌.

శ్రియ‌ బాల‌య్య‌తో ఇప్ప‌టికే చెన్న‌కేశ‌వ‌రెడ్డి, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, పైసా చిత్రాల్లో జ‌త‌క‌ట్టింది. బాల‌య్య‌తో ఆడిపాడిన ఈ సుంద‌రి ఇప్పుడు మ‌రోమారు జ‌త‌క‌ట్ట‌బోతుందుట‌. గ‌తేడాది శ్రియ ర‌ష్య‌న్‌కు చెందిన త‌న బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే. శ్రియ పెండ్లి చేసుకున్న త‌రువాత సినిమాల‌కు కొంత విరామం ప్ర‌క‌టించారు. మ‌ళ్ళా బాల‌య్య సినిమాతోనే రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న‌ది. బాల‌య్య స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్ల‌లో శ్రియ ఒక‌రు కాగా మ‌రో హీరోయిన్ కోసం వెతుకుతున్నార‌ట‌. ఏదేమైనా శ్రియ‌కు బాల‌య్య సినిమా ఒక జాక్‌పాటేన‌ని టాలీవుడ్ టాక్‌.

బాల‌య్యతో సైఅంటున్న టాప్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts