బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు ” టీజర్

June 1, 2019 at 12:50 pm

తెలుగు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జయపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికీ ఆయన నటించిన చిత్రాలేవీ ఆయనకు మాస్ ఇమేజ్ని సంపాదించలేక పోయాయి. ఆయన ఇండస్ట్రీలోి నిలదొక్కుకో వడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ప్రేమకథ అంశాలతోపాటు యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం రాక్షసుడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర చాలా ఆసక్తిదాయకంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇదే విషయాన్ని మనకు చూపిస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్కు జోడిగా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ నటిస్తోంది. ర‌మేశ్ వ‌ర్శ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం టీజ‌ర్ ను శ‌నివారం విడుదల చేశారు. జూన్ 18న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బెల్ల‌కొండ శ్రీనివాస్ పోలీస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల శ్రీనివాస్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సీత సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డింది. ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఆయ‌న రాక్ష‌సుడు మూవీని చాలెంజింగ్ గా తీసుకున‌ట్లు స‌మాచారం. టీజ‌ర్ కూడా ఆక‌ట్ట‌కునేలా ఉంది. స‌స్పెన్స్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌లా ఉంది. టీజ‌ర్ చివ‌ర‌లో హీరో క్యారెక్ట‌ర్ గురించి సూర్య చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి zhttps://www.youtube.com/watch?v=DDdHIQgxkgM

బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు ” టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts