త‌మ్ముళ్ల నోట‌.. టీడీపీ వ్య‌తిరేక మాట‌..!

June 12, 2019 at 10:34 am

త‌మ్ముళ్ల నోట టీడీపీ వ్య‌తిరేక మాట‌! అవును. ఇప్పుడు ఏ ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు క‌లిసినా.. ఫోన్లు చేసుకున్నా.. త‌మ పార్టీ అధినేత‌, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పిన నాయ‌కుడు చంద్ర‌బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. త‌మ‌ను వేధించుకు తిన్నాడ‌ని, బాసిజం చేశాడ‌ని, త‌మ‌ను క‌నీసం నాయ‌కులుగా కూడా చూడ‌లేద‌ని వారు వాపోతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల్లోనూ తాము టీడీపీ కోసం 2014లో కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసుకున్నామ‌ని, అయితే, వీటిని ఏమాత్రం లెక్క‌లోకి తీసుకోకుండా.. త‌మ‌కు క‌నీసం మ‌ర్యాద కూడా ఇవ్వ‌కుండా ఎంత‌సేపూ.. టెలీ కాన్ఫ‌రెన్సులు, స‌ర్వేలు అంటూ ప్రాణం తీశాడ‌ని అంటున్నారు.

అయితే, ఇప్పుడు ఎందుకు ఇంత‌లా బాబుపై త‌మ్ముళ్లు ఫైర్ అవుతున్నారు? అనేది కామ‌న్‌గా వినిపించే ప్ర‌శ్న‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ పాల‌న‌! ఆశ్చ‌ర్యంగా అనిపించినా .. ఇది నిజం. ఆయ‌న కూడా ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారు. కానీ, ఏనాడూ టెలీ కాన్ఫ‌రెన్సులు, వీడియో కాన్ఫ‌రెన్సులు అంటూ.. నేత‌ల‌ను వేధించింది లేదు. ఇక టికెట్ల విష‌యంలో ఖ‌చ్చితంగా త‌న నిర్ణ‌యాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారే త‌ప్ప నాన్చుడు ధోర‌ణుల‌ను అవ‌లింభించ‌లేదు. త‌న ప‌నిని తాను సూటిగా సుత్తి లేకుండా చేసుకుపోయారు.

ఇక‌, ఇప్పుడు ఏపీలో భారీ మెజారిటీతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన ప‌దిరోజుల్లోనే మెరుపులు మెరిపిస్తున్నారు. కేబినెట్ కూర్పు నుంచి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, న‌వ‌ర‌త్నా ల అమ‌లు వంటి వాటిని సూటిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు పోతున్నారు. ఎక్క‌డా అతిశ‌యోక్తి లేకుండా.. ప్ర‌చారాన్ని న‌మ్ముకోకుం డా ఆయ‌న త‌న ప‌నే త‌నకు ప్ర‌చారం తెచ్చి పెడుతుంద‌నే ధోర‌ణిని అవ‌లంబిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా స‌మ‌స్య‌లుగా ఉ న్న వాటిని క్ష‌ణాల్లో ప‌రిష్క‌రిస్తున్నారు. అదేవిధంగా పార్టీలోని కీల‌క నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టినా.. వారికి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సైతం శ‌ర‌వేగంగా ఇస్తూ.. వారి మ‌న‌సుల్లోనూ కీల‌క స్థానం పొందుతున్నారు.

అదే చంద్ర‌బాబు హ‌యాంలో అయితే, ఒక్క నామినేటెడ్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు నానా పాట్లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని, కేవ‌లం ఎన్నిక‌ల‌కు ఏడాది రెండేళ్ల ముందు మాత్ర‌మే ఆయా ప‌ద‌వుల‌ను చంద్ర‌బాబు భ‌ర్తీ చేశార‌ని నాయ‌కులు చెప్పుకొంటున్నారు. దీంతో ఇప్పుడు బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో జ‌గ‌న్ కు ఎంత మంది వీరాభిమానులుగా మారుతారో చూడాలి.

త‌మ్ముళ్ల నోట‌.. టీడీపీ వ్య‌తిరేక మాట‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts