బిగ్ బ్రేకింగ్ః మెగాస్టార్‌ అల్లుడికి వేధింపులు

June 12, 2019 at 6:05 pm

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడికి పోకిరీల నుంచి వేధింపులు త‌ప్ప‌డం లేదు. చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సుమారు 10మంది పోకిరీలు వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ట‌. ఈమేర‌కు చిరంజీవి అల్లుడు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో వేధింపుల సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ ప్ర‌స్తుతం సిని రంగ ప్ర‌వేశం చేశారు. క‌ళ్యాణ్‌దేవ్ ఇటీవ‌ల హీరోగా విజేత సినిమాతో తెరంగ్రేటం చేయ‌డం సినిలోకానికి తెలిసిందే. క‌ళ్యాణ్‌దేవ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప‌ది మంది పోకిరీలు అస‌భ్య ప‌ద‌జాలంతో వ్య‌క్తిగ‌త‌, కుటుంబ స‌భ్యుల‌పై దూష‌ణ‌ల‌కు దిగుతున్నార‌ని ఆ పిర్యాదులో తెలిపారు. క‌ళ్యాణ్‌దేవ్ పిర్యాదు మేర‌కు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.

క‌ళ్యాణ్‌దేవ్ ను దూషించ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందాడు. గ‌త ప‌ది రోజుల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోకిరిలు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో వాళ్ళు వెంట‌నే రంగంలోకి దిగి పోకిరిలు ఎవ‌రెవ‌రు ఉన్నారు. వాళ్ళు ఎక్క‌డ ఉంటారు అనే వివ‌రాల‌ను సేక‌రించిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లో పోకిరీల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌నున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా ఓ సిని న‌టుడి ప‌ట్ల‌ ఇలా పోకిరిలు అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం చాలా భాదాక‌రం.

బిగ్ బ్రేకింగ్ః మెగాస్టార్‌ అల్లుడికి వేధింపులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts