ఓర‌చూపుల “దొర‌సాని”టీజ‌ర్ రిలీజ్‌…!

June 6, 2019 at 12:44 pm

తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూరు… ఆ ప‌ల్లేటూరులో ఓ పేదింటి అబ్బాయి రాజు. రోజూ స్నేహితుల‌తో ఆడిపాడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.. ఆ ఊరు దొర‌బిడ్డ ప‌ట్నం నుంచి కారులో వ‌స్తుంది. ఇంత‌లో కారు ప‌క్క‌నుండే రాజు బైక్‌పై వెళుతుంటాడు. కారులో ఓర‌చూపుల‌తో దొర‌సాని రాజును చూస్తుంది. రాజు ఓర‌చూపుల దొర‌సానిని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. అలా మొద‌లైన ఓర‌చూపుల ప్రేమ రోజులు గ‌డిచినా కొద్ది మ‌రింత బ‌ల‌మ‌వుతుంది. ఇది స్నేహితుల‌కు తెలిసినా త‌మాషా అనుకుంటారు.. కానీ త‌రువాత నిజం తెలుసుకుంటారు. దొర‌సాని, రాజు ప్రేమ ఊరులో తెలుస్తుంది. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌ని ద‌శ‌లో ఏమి జ‌రిగింది అనేది ఈ సినిమా క‌థ‌.

దొర‌సానిగా న‌టుడు రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక‌, రాజుగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌లు క‌లిసి న‌టిస్తున్న దొర‌సాని సినిమా టీజ‌ర్ విశేషాలు. ఈ సినిమా ద్వారా అటు శివాత్మిక‌, ఇటు ఆనంద్ దేవ‌ర‌కొండ‌లు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. దొర‌సానిగా దేవ‌కీ (శివాత్మిక‌), పేదింటి రాజుగా (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) న‌టిస్తున్న దొర‌సాని సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. టీజ‌ర్ చూస్తున్నంత సేపు ఓ ప‌ల్లేటూరు లో జ‌రిగే య‌దార్థ సంఘ‌ట‌ల‌ను, పేద‌, ధ‌నిక వ‌ర్గాల కుటుంబాలు ప్ర‌తిభింబించాయి.

టీజ‌ర్‌లో శివాత్మిక దొర‌సానిగా, రాజుగా ఆనంద్ దేవ‌ర‌కొండ ఒదిగి పోయి న‌టించారు. దొర‌సాని సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్‌కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఈ సినిమాకు కేవీఆర్ మ‌హేంధ్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, స‌న్నీ కొర్ర‌పాటి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఇక ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండ‌గా సురేష్ బాబు, య‌స్ రంగినేని, మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర యూనిట్‌.

ఓర‌చూపుల “దొర‌సాని”టీజ‌ర్ రిలీజ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts