గోపీచంద్ “చాణ‌క్య” ఫ‌స్ట్‌లుక్ …!

June 12, 2019 at 6:20 pm

ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణం జ‌రుపుకుంటున్న చాణ‌క్య సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్‌. డైన‌మిక్ హీరో గోపీచంద్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం చాణ‌క్య‌. గోపీచంద్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డంతో గోపీచంద్ అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయింది.

విలక్ష‌ణ విల‌న్‌గా తెలుగు తెర‌పై త‌ళ‌క్కున మెరిసిన టి.గోపీచంద్ త‌రువాత హీరోగా మారాడు. విల‌న్‌గా న‌టించినా త‌న‌దైన శైలీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాడు. ఇప్పుడు హీరోగా యాక్ష‌న్ చిత్రాల‌ను ఎంచుకుంటూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. అయితే ఇప్పుడు గోపీచంద్ మ‌రో స్పై థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. చాణ‌క్య అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు.

గోపీచంద్ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ చాణ‌క్య ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసి కానుక ఇచ్చింది. ఈ ఫ‌స్ట్ లుక్‌లోనే గోపీచంద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుప‌డం విశేషం. ఫ‌స్ట్‌లుక్‌లో గోపీచంద్ ఢిప‌రెంట్‌గా క‌నిపించాడు. పెరిగిన గ‌డ్డం, న‌ల్ల టీ ష‌ర్ట్‌, దానిపై చినిగిన తెల్ల టీ ష‌ర్ట్ , మెడ‌కు ఒక స్టోల్‌ను చుట్టుకుని జ‌నంలోంచి న‌డుచుకుంటు వ‌స్తున్న ఫోటోతో కూడిని ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాకు అనిల్ సుంక‌ర నిర్మిస్తుండ‌గా, త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు.

గోపీచంద్ “చాణ‌క్య” ఫ‌స్ట్‌లుక్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts