“హిప్పి”..రివ్యూ&రేటింగ్

June 6, 2019 at 3:12 pm

సినిమా ః హిప్పి

నటీనటులు :జెడి చక్రవర్తి, కార్తికేయ, దిగంగన‌ సూర్యవంశీ, జబ్జా సింగ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు

సంస్థ ః వి క్రియోష‌న్స్‌

దర్శకత్వం : టిఎన్ కృష్ణ

నిర్మాత : కలై పులి. థాను

సంగీతం : నివాస్ కె ప్రసన్న

సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజేష్

ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్

విడుదల తేదీ : జూన్ 06, 2019

ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశి, జబ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ -హిప్పీ. ఈ సినిమా గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర‌కు రంజింప‌జేసిందో ఓ లుక్కేద్దాం.

కథ :

సినిమా ప్రారంభంలోనే దేవ్ (కార్తికేయ) స్నేహతో (జజ్బా సింగ్) ప్రేమ‌లో ప‌డుతాడు. ఓవైపు స్నేహ‌తో ప్రేమ‌లోనే ఉన్న దేవ్ ఆమే స్నేహితురాలైన ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశి)ను చూడ‌గానే ఆమేతోను ప్రేమ‌లో పడిపోతాడు. ఆముక్త‌మాల్య‌ద‌ను ప్రేమ‌లో దించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి దేవ్ ఆమేను ప్రేమ‌లో ప‌డేస్తాడు. దీనికి అముక్త‌మాల్య‌ద కూడా దేవ్ తో ప్రేమ‌లో ప‌డుతుంది. కొన్న ష‌రతుల‌తో ఆమే దేవ్‌ను ల‌వ్ చేస్తుంది. కొంత‌కాలం త‌రువాత ఇద్ద‌రి న‌డుమ కొన్న అపోహ‌లు రావ‌డం, ఆనంద్ (జేడీ చ‌క్ర‌వ‌ర్తి) ఈ ప్రేమ వ్య‌వ‌హారంలో క‌ల్పించుకుని ఇద్ద‌రు స్నేహితురాల్ల ప్రేమ‌ను దేవ్‌తో ఎలా ముగించాడ‌నేది తెర‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

జేడీ చ‌క్ర‌వ‌ర్తి చాలా రోజుల త‌రువాత తెలుగు తెర‌పై క‌నిపించి సీనియ‌ర్ న‌టుడిగా ఈ సినిమాకు బాగా ప్ల‌స్ అయ్యాడు. ఇక కార్తికేయ న‌ట‌న బాగా ఆక‌ట్టుకుంది. యూత్‌కు న‌చ్చే విధంగా కార్తికేయ న‌ట‌న ఉంది. ద‌ర్శ‌కుడు కూడా యూత్‌ను ఎ్ర‌టాక్టివ్ చేయ‌డానికి అనేక అంశాల‌ను తీసుకుని విజ‌య‌వంతం అయ్యాడు. కార్తికేయ త‌న సిక్స్‌ప్యాక్‌తో యూత్‌ను బాగా ఆక‌ట్టుకున్నాడ‌నే చెప్పాలి. సినిమాలో ఫైట్లు, పాట‌లు సంద‌ర్భానుసారంగా రావ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్దం ప‌డుతుంది. చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు త‌మ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్నారు. సినిమాలో హాస్య స‌న్నివేశాలు మ‌ధ్య‌మ‌ధ్య‌లో చాలా ఫ‌న్నిగా ఉన్నాయి. సో న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల‌కు త‌గిన న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ప్రేమ స‌న్నివేశాలు కొత్త‌ద‌నం లేకుండా పోయాయి. స్క్రీన్ ప్లే పూర్ గా ఉంది. మాస్ మ‌సాల స‌న్నివేశాలు అతిగా ఉండటం కొంత మేర‌కు మైన‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. స‌న్నివేశాలు ఓ న‌దిలా సాఫిగా సాగ‌కుండా, అనేక అడ్డంకుల‌ను దాటుకుంటూ వెళ్ళే కాలువ‌గా తీసారు. ద‌ర్శ‌కుడు కొన్ని స‌న్నివేశాల‌ను అన‌వ‌స‌రంగా తీసార‌నిపిస్తుంది. ఏదేమైనా ప్ల‌స్‌క‌న్నా మైన‌స్‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. వీటిని యూత్ ప‌ట్టించుకునే ప‌రిస్థ‌తి లేకుండా తీయ‌గ‌లిగాడు.

సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం సినిమాను అన్ని విభాగాల్లో అనుకున్న మేర‌కు తీయ‌గ‌లిగార‌నిపించింది. ఆర్‌.డి. రాజేష్ సినిమాటోగ్ర‌ఫీ అత్య‌ద్భుతంగా ఉంది. ద‌ర్శ‌కుడు తాను అనుకున్న మేర‌కు, యూత్‌ను మెప్పించేలా సినిమాను రూపొందించి విజ‌య‌వంతం అయ్యాడు. సినిమా పాట‌లు ఒకేసారి కాకుండా రెండుమూడు సార్లు వింటే మ‌ళ్ళీ మ‌ళ్ళీ వినాల‌పించేలా ఉన్నాయి. ఎడిటింగ్‌లో ప్ర‌వీణ్ త‌న స‌త్తాను చాటాడు. సంగీత ద‌ర్శ‌కుడు నివాస్ కే ప్ర‌స‌న్న స్వ‌ర‌ప‌రిచిన స్వ‌రాలు విన‌సొంపుగా ఉన్నాయి.

తీర్పు :

త‌మిళ ద‌ర్శ‌కుడు టిఎన్‌ కృష్ణ దర్శకత్వం లో రూపొందిన హిప్పి సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా ఉంది. ఆర్ ఎక్స్ 100హీరోగా కార్తికేయ, దిగంగన సూర్యవంశీలు న‌టించిన తీరు బాగుంది. థీమ్ తో పాటు సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, కార్తికేయ నటన, కొన్ని డైలాగ్ లు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. హ‌స్య స‌న్నివేశాలు, ప్రేమ స‌న్నివేశాలు, ఫైట్ స‌న్నివేశాలు మ‌రికొంత బాగా తీయాల్సి ఉన్న‌ప్ప‌టికి, ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేర‌కు విజ‌య‌వంతం చేస్తారో వేచి చూడాల్సిందే.

రేటింగ్ : 2/5

“హిప్పి”..రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts