కాజల్ ని మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా ..చూస్తే ఇక అంతే !

June 1, 2019 at 11:38 am

తెలుగు చిత్రసీమలో సీనియర్ కథానాయిక కాజల్. ఒకానొక దశలో తనదైన అందం సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే అలరిస్తోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన విషయం వైరల్ అవుతుంది. అదేమిటంటే ఎలాంటి మేకప్ లేకుండా సహజమైన తన ఫోటోలను సోషల్ మీడియాలో కాజల్ షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే ఆ ఫోటోలు షేర్ చేయడానికి గల కారణాలను కాజల్ వివరించింది. అందమంటే శారీరక అందం ఒక్కటే కాదని.. మనసుకు సంబంధించింది అని.. మనల్ని మనం సహజంగా స్వీకరించడం అని ఆమె పేర్కొంది.

మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలని.. మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని కాజల్ ఈ సందర్భంగా చెప్పింది. అందం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని, ఆ ఉత్పత్తులు మనల్ని అందంగా చూపిస్తున్నాయని.. శరీరాకర్షణ ప్రతి చోటా ఉందని ఆమె పేర్కొంది. ”మనలోని భిన్నమైన వ్యక్తిని చూపించాలి అనుకోకుండా.. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడం మొదలు పెట్టినప్పుడు నిజంగా ఆనందంగా ఉంటాం. మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంది” అని కాజల్‌ చెప్పడం గమనార్హం.

అయితే… కాజల్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న తార.. ఇలా మేకప్ లేకుండా తన ఫొటోలను షేర్ చేయడం గొప్ప విషయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్ ని మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా ..చూస్తే ఇక అంతే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts